సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో 300 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టిన మీనాక్షి చౌదరికి ప్రస్తుతం అన్ని మంచి రోజులే, ఇంకేంటి అమ్మడుకి అలుపెరగని అవకాశాలు వస్తాయని అందరూ ఎదురు చూస్తున్నారు. లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం బ్యాక్ టు బ్యాక్ విజయాలు మీనాక్షిని ఊపిరి సలపనంత బిజీగా మారుస్తాయనే అనుకున్నారు.
అయితే క్రేజీగా బిజీగానే కనబడుతుంది మీనాక్షి చౌదరి. కాకపోతే సినిమా అవకాశాలతో కాదు, షాప్ ఓపెనింగ్స్, రిబ్బన్ కటింగ్స్ అంటూ హడావిడి చేస్తుంది. నవీన్ పోలిశెట్టి తో అనగనగ ఒక రాజు చిత్రంలో నటిస్తున్న మీనాక్షి చౌదరి సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ షో చేస్తుంది.
అవకాశాలు అందుకోవాలంటే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండాలి అనే సూత్రాన్ని ఫాలో అవుతున్న మీనాక్షి చౌదరి తాజాగా కిర్రాక్ లుక్ లవ్ కనిపించి అదరగొట్టేసింది. గోల్డెన్ కలర్ టాప్‌తో పాటు, బ్లాక్ కలర్ పాయింట్‌ను ధరించిన మీనాక్షి టాప్ అందాలు చూస్తే మతిపోవాల్సిందే.. అంటూ నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు.