Advertisementt

ఆశ చావ‌ని బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్

Tue 08th Apr 2025 09:52 PM
harish shankar  ఆశ చావ‌ని బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్
Harish Shankar has high hopes ఆశ చావ‌ని బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్
Advertisement
Ads by CJ

ఇండ‌స్ట్రీకి మాస్ సినిమాల్ని అందించ‌డంలో ఈ ద‌ర్శ‌కుడికి ఒక ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అని ట్యాగ్ కూడా ఇచ్చారు. చాలా మంది సీనియ‌ర్ ద‌ర్శ‌కుల బాట‌లోనే అత‌డు మాస్ యాక్ష‌న్ సినిమాల‌ను రూపొందించి స‌క్సెస‌య్యారు. అయితే నెమ్మదిగా కాలం మారింది. పాత‌త‌రం అంత‌రించింది. పెద్ద తోపు డైరెక్ట‌ర్లు అని చెప్పుకునేవాళ్లంతా స‌క్సెస్ లేక క‌నుమ‌రుగ‌య్యారు. కాలంతో పాటే ఈ పెను మార్పు. ఇప్పుడు ఆ తోపు డైరెక్ట‌ర్ల వార‌సుడు కూడా సినిమా తీయ‌డం కోసం ఏళ్ల త‌ర‌బ‌డి వేచి చూడాల్సి వ‌స్తోంది. AI జెన్ - జెడ్ డైరెక్ట‌ర్లు దూసుకొస్తున్న ఈ స‌మ‌యంలో అత‌డు తిరిగి కోలుకుంటాడో లేదో డౌటే! 

అందుకే పెద్ద హీరోలు అవ‌కాశం ఇచ్చిన‌ట్టే ఇచ్చి మొహం చాటేస్తున్నారు. ప‌రిశ్ర‌మ అగ్ర హీరో, ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో ఉన్న ప్ర‌ముఖ‌ క‌థానాయ‌కుడు భారీ ఆఫ‌ర్ ఇచ్చారు. కానీ ఆ సినిమా ప‌ట్టాలెక్క‌డం ఎప్ప‌టికి సాధ్య‌మో ఎవ‌రికీ తెలీని  దుస్థితి. దీంతో ఈ ప్రాజెక్ట్ గాల్లో ఊగిస‌లాడుతోంది. దాంతో పాటే ఆ మాస్ డైరెక్ట‌ర్ విలువైన నాలుగేళ్ల కాలం ఇప్ప‌టికే క‌ర్పూరంలా క‌రిగిపోయింది. పెద్ద హీరోతో సినిమా తీస్తున్నా! అని చెప్పుకోవ‌డం త‌ప్ప ఆ డైరెక్ట‌ర్ కి మిగిలిందేమీ లేదు. అత‌డు ఈ స‌మ‌యంలో హోట‌ల్ పెట్టుకున్నా, రియ‌ల్ ఎస్టేట్ లోకి వెళ్లినా కోట్లు వెన‌కేసుకునేవాడని విశ్లేషిస్తున్నారు.

కానీ సినిమా త‌ప్ప ఇంకేదీ తెలీద‌ని అంటాడు! అందుకే ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా ఇంకా ఆ పెద్ద హీరో వెంట‌ప‌డుతూనే ఉన్నాడు. ఇది ఎండ్ లెస్ ప్రాసెస్‌లా సాగుతూనే ఉంది.  స‌రిగ్గా ఇలాంటి స‌మ‌యంలో ఇత‌ర‌ హీరోతో త‌దుప‌రి ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడట. దీనికోసం స్క్రిప్టు ప‌నులు ప్రారంభించాడని తెలుస్తోంది. అత‌డి లిస్ట్ లో ఒక యంగ్ హీరో, ఒక అగ్ర హీరో కూడా ఉన్నారు. అయితే ఆ ఇద్ద‌రినీ స్క్రిప్టుతో ఒప్పించేదెపుడు?  సెట్స్ కెళ్లేది ఎప్పుడు? అన్న‌ది కాల‌మే నిర్ణ‌యించాలి. అత‌డి ఫేట్ ని డిసైడ్ చేసేది ఎంపిక చేసుకున్న స్క్రిప్టు-కాన్సెప్టు. మునుప‌టిలా ఔట్ డేటెడ్ క‌థ‌ల‌తో ముందుకు వెళ్లాలంటే అంత సులువేమీ కాదు! జెన్ జెడ్ ఫిలింమేక‌ర్‌గా అప్ డేట్ అవ్వ‌క‌పోతే అంతే సంగ‌తి!

Harish Shankar has high hopes:

Harish Shankar 

Tags:   HARISH SHANKAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ