పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో గాయాలపాలయ్యాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. ఈ విషయం తెలిసిన రాజకీయ ప్రముఖులు పవన్ కి ధైర్యం చెబుతూ పవన్ కొడుకు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు పెట్టారు.
ప్రధాని మోడీ దగ్గర నుంచి చంద్రబాబు, లోకేష్, వైసీపీ అధినేత జగన్, రోజా ఇలా ప్రతి ఒక్కరూ పవన్ కొడుకు త్వరగా కోలుకోవాలంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ట్వీట్లు పెట్టారు. పవన్ తన కొడుకు ప్రమాదం తెలిసి హుటాహుటిన సింగపూర్ వెళ్ళలేదు, ఆయన అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని… కాబట్టి ఆ గ్రామం వెళ్ళి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకొంటానని చెప్పిన ఆ పని పూర్తిచేసుకుని వైజాగ్ ఎయిర్ పోర్ట్ నుంచి సింగపూర్ బయలు దేరారు.
అక్కడ ఎయిర్ పోర్ట్ లో మీడియా తో మట్లాడుతూ.. నేనేదో చిన్నపాటి అగ్నిప్రమాదం అనుకున్నా కానీ ఈ స్థాయి ప్రమాదం అనుకోలేదు. మార్క్ కాళ్ళు, చేతులు కాలి పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడం వల్ల బ్రాంకోస్కోపీ చేస్తున్నారు.. ఈ ప్రమాదంలో తన తోటి విద్యార్థిని ప్రాణం కోల్పోవడం దురదృష్టకరమైన విషయం అంటూ ఎమోషనల్ అయ్యారు, అంతేకాదు పరిస్థితి గురించి వాకబు చేసినందుకు మోడీ గారికి, చంద్రబాబు గారికి, రేవంత్ రెడ్డి గారికి, కేంద్రమంత్రులకు, జగన్ గారికి, లోకేష్ గారికి, ఇతర నాయకులకు మరియు నాతోటి నటీనటులు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.. అంటూ పవన్ కళ్యాణ్ కొడుకు ప్రమాదం పై మాట్లాడారు.