2013 లో దిల్‌షుక్ నగర్ లో జరిగిన జంట పేలుళ్ల కేసులో ఫైనల్ గా తుది తీర్పుని వెల్లడించింది తెలంగాణ హై కోర్ట్. ఈ పేలుళ్లలో 18 మంది అక్కడికక్కడే మృతి చెందగా 131 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుళ్లకు బాద్యులైన అసదుల్లా అక్తర్, తహసీన్ అక్తర్, జియా ఉర్ రెహమాన్, భక్తల్ అజాజ్, ఐజాజ్ షేక్ ల ఐదుగురికి 2016 లోనే ఎన్ ఐఏ కోర్టు ఇప్పటికే ఉరి శిక్షను ఖరారు చేస్తూ తీర్పు ఇవ్వగా ఆ ఐదుగురు తెలంగాణ హై కోర్ట్ ను ఆశ్రయించారు.
ఇప్పుడు ఈ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దిల్‌షుక్ నగర్ లో జరిగిన జంటపేలుళ్ల కేసు విషయంలో పలుదఫాలుగా విచారణ జరిపిన హైకోర్టు మంగళవారం ఉదయం తీర్పు వెలువరించింది. ఎన్ ఐఏ కోర్టు ఇచ్చిన ఉరి శిక్ష తీర్పును తెలంగాణ హైకోర్టు సమర్థించింది. ఉరి శిక్ష సరైందే అని తెలంగాణ హై కోర్టు వ్యాఖ్యానించింది.
తెలంగాణ హై కోర్టు తీర్పు పై బాధిత కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. వీలైనంత త్వరగా నిందితులను ఉరి తియ్యాలని వారు కోరుకుంటున్నారు.