టాప్ డైరెక్టర్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉంటాయా, నిన్న సుకుమార్ తో ఎన్టీఆర్ కనిపిస్తేనే తెగ ఎగ్జైట్ అయిన ఫ్యాన్స్. ఇప్పుడు వంశీ పైడిపల్లి, ప్రశాంత్ నీల్, సుకుమార్ ఫ్యామిలీస్ తో కలిసి కనబడితే విషయం మాములుగా ఉండదు.
ఆ అరుదైన కలయిక హైదరాబాద్ లోనే జరిగింది. డైరెక్టర్ వంశి పైడిపల్లి వైఫ్ మాలిని బర్త్ డే పార్టీ సందర్భంగా ఎన్టీఆర్ తన భార్య ప్రణతి తో కలిసి హాజరవగా, అక్కడికి సుక్కు ఆయన భార్య తబిత, ప్రశాంత్ నీల్ వచ్చారు. వీరంతా కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇప్పుడా పిక్ వైరల్ గా మారింది.
మరి ఎన్టీఆర్-నీల్ కలయికలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా, సుకుమార్ పుష్ప 2 తర్వాత రిలాక్స్ అవుతున్నారు. వంశి పైడిపల్లి మాత్రం వారసుడు తర్వాత దర్శకత్వానికి లాంగ్ బ్రేక్ తీసుకున్నారు.