రాజా సాబ్ రిలీజ్ డేట్ పై రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాజా సాబ్ ఏప్రిల్ నుంచి పోస్ట్ పోన్ అయ్యి దసరా కి వెళ్ళింది అని ఒకసారి, కాదు సెప్టెంబర్ అని మరోసారి, ఇప్పుడేమో రాజా సాబ్ ఈ ఏడాది రాకపోవచ్చు, 2026 సంక్రాంతికి పక్కాగా రాజా సాబ్ వస్తుంది అంటూ ప్రచారం మొదలైంది.
దర్శకుడు మారుతి ఈ రిలీజ్ డేట్ విషయంలో ఒత్తిడికి లోనవుతున్నాడనే మాట వినబడనుండి. ప్రభాస్ డేట్స్ కరెక్ట్ గా ఇస్తే రాజా సాబ్ షూటింగ్ ఈపాటికే పూర్తయ్యేది, ఒకవేళ ఏప్రిల్ నుంచి షిఫ్ట్ అయినా రాజా సాబ్ రిలీజ్ తేదీ ఫైనల్ చేసేవారు. కానీ షూటింగ్ పూర్తి కాకుండా రిలీజ్ డేట్ ఎలా ఇవ్వాలి, ఇచ్చాక మరోసారి పోస్ట్ పోన్ అంటే క్రేజ్ పోతుంది. అందుకే మారుతి కూడా సైలెంట్ గా పని చేసుకుంటున్నాడట .
కాని రాజా సాబ్ పై సోషల్ మీడియాలో కనబడుతున్న వార్తలు చూస్తుంటే మారుతి కూడా టెన్షన్ ఫీల్ అవుతున్నాడట. సోషల్ మీడియాలో రోజుకోసారి అయినా రాజా సాబ్ రిలీజ్ డేట్ ముచ్చట నడవకుండా ఉండడం లేదు, అదే ఇప్పుడు మారుతిని ఒత్తిడికి గురిచేస్తున్నట్లుగా గుసగుసలాడుకుంటున్నారు.