కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో పుష్ప రాజ్ అల్లు అర్జున్ జత కడుతున్నారు అనగానే అందరిలో అంచనాలు మొదలైపోయాయి. జవాన్ తర్వాత అట్లీ, అల్లు అర్జున్ కి కథ చెప్పి ఒప్పించారు. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ తో సినిమా అనౌన్స్ చేసిన అల్లు అర్జున్ అట్లీ తోనే ముందుగా సెట్స్ మీదకి వెళుతున్నారు. ఈరోజు ఏప్రిల్ 8 అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా #AA22xA6 ని ఓ స్పెషల్ వీడియో తో అనౌన్స్ చేసింది నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్.
హాలీవుడ్ రేంజ్ లో #AA22xA6 అనౌన్సమెంట్ ఉంది. అట్లీ, అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ను హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్లుగా అనౌన్సమెంట్ వీడియోతోనే క్లారిటీ ఇచ్చేసారు. చెన్నై లో మీటింగ్ పెట్టి ఆ తర్వాత అమెరికా లాస్ ఏంజిల్స్ వెళ్లి అక్కడ టాప్ టెక్నీషియన్స్ తో అల్లు అర్జున్-అట్లీ తమ సినిమాకి సంబందించిన డిస్కర్షన్స్ పెట్టి మరీ హీరో అల్లు అర్జున్ లుక్ టెస్ట్ చేస్తున్న వీడియో ని వదిలారు.
నిజంగా అనౌన్సుమెంట్ వీడియో తోనే అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్ పై ఇంటర్నేషనల్ రేంజ్ లో అంచనాలు క్రియేట్ చెయ్యడంలో సూపర్ సక్సెస్ అయ్యారంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్ విషయంలో ఎంత డెడికేషన్ తో ఉన్నారో ఈ వీడియో చెప్పకనే చెప్పేసింది అంటూ అల్లు ఫ్యాన్స్ #AA22xA6 అనౌన్సమెంట్ వీడియో తో సంబరాలు చేసుకుంటున్నారు.