హరి హర వీరమల్లు మే 9 రిలీజ్ అంటూ మేకర్స్ గొప్పగా రిలీజ్ డేట్ ని లాక్ చేసారు. అందుకు అనుగుణంగా ప్రమోషన్స్ స్టార్ట్ అవ్వలేదు, మరోపక్క షూటింగ్ ఫినిష్ అయిన దాఖలాలు లేవు, ఇంకోపక్క హరి హర వీరమల్లు రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు అనే వార్తలతో పవన్ ఫ్యాన్స్ లో యదాతతంగా గందరగోళం మొదలైంది.
సినిమాని మార్చ్ 28 నుంచి మే 9 కి పోస్ట్ పోన్ చేస్తూ ఈసారి హరి హర వీరమల్లు ఎట్టి పరిస్థితుల్లో మే 9 కి వస్తుంది అని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే పూర్తయిన షూటింగ్ కి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్, విఎఫెక్స్ పనులు మొదలైపోయాయి. పవన్ కూడా రెండుమూడు రోజులు డేట్స్ ఇస్తే షూటింగ్ కంప్లీట్ అవుతుంది అన్నారు.
పవన్ చూస్తే పర్యటనల్లో ఉంటున్నారు. ఒకవేళ షూటింగ్ పూర్తయినా, పవన్ ప్రచారానికి వస్తారా, సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటారా అనేది ప్రస్తుతానికి నడుస్తున్న సస్పెన్స్, మరోపక్క వీరమల్లు రావడనికి నెల సమయమే ఉంది, హడావిడి మాత్రం మొదలు కాలేదు, అందుకే నెటిజెన్స్ సమయం లేదు, వీరమల్లు మేలుకో అంటూ కామెంట్లు పెడుతున్నారు.