అక్కినేని అఖిల్ మాస్ ని వదలడంలేదు. అఖిల్ ఫస్ట్ సినిమాతోనే మాస్ హీరోగా మారలనుకున్నాడు. కానీ మాస్ కథ అఖిల్ కి బిగ్ షాకిచ్చింది. తర్వాత చేసిన సినిమాలన్నీ మాస్ ని టచ్ చేసినా ఎక్కువగా లవ్ స్టోరీస్ నే చేసాడు. ఆతర్వాత చేసిన మాస్ ఏజెంట్ కూడా అఖిల్ కి షాకిచ్చింది. దానితో అఖిల్ రెండేళ్ల పాటు భారీ గ్యాప్ తీసుకున్నాడు.
ఈమధ్యనే అఖిల్ తన #Akhil 6 ప్రాజెక్ట్ మొదలు పెట్టాడు. కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న #Akhil 6 నుంచి రేపు ఆయన బర్త్ డే సందర్భంగా సర్ ప్రైజ్ ట్రీట్ సిద్ధం చేస్తూ ఈరోజు అప్ డేట్ కి సంబంధించి ప్రీ లుక్ పోస్టర్ వదిలారు మేకర్స్. అందులో అఖిల్ మాస్ అవతార్ లో కనిపించబోతున్నట్టుగా అర్ధమవుతుంది.
రేపు అఖిల్ మాస్ అవతార్ చూసి ఫ్యాన్స్ ఎగ్జైట్ అవ్వడం ఖాయమంటున్నారు. అఖిల్ మాస్ ట్రీట్ కోసం అభిమానులు రెడీ అవుతుంటే.. నెటిజెన్స్ మాత్రం అఖిల్ మాస్ ని వదలవా అంటూ కామెంట్ చేస్తున్నారు.