టెస్ట్ మ్యాచ్ లో
రెండు ఇన్నింగ్స్ ఉన్నట్టు
రెండేళ్లుగా నిర్మాణం జరుపుకున్న
టెస్ట్ అనే మూవీ ఎట్టకేలకు
ఈ వీక్ నేరుగా OTT లోకి వచ్చింది.
గత శుక్రవారం భారీ స్టార్ క్యాస్ట్ మాధవన్, నయనతార, సిద్దార్థ్ లు నటించిన టెస్ట్ ఓటీటీ నుంచి నేరుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్ నుంచి టెస్ట్ ఏప్రిల్ 4 న ఓటీటీలోకి వచ్చేసింది. నయనతార, మాధవన్, సిద్దార్థ్, మీరా జాస్మిన్ లాంటి స్టార్స్ టెస్ట్ లో నటించారు అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించవచ్చు. కానీ టెస్ట్ స్ట్రీమింగ్ కి ముందు ఎలాంటి బజ్ క్రియేట్ చేయలేకపోవడం గమనించాల్సిన విషయం. ఏప్రిల్ 4 న టెస్ట్ నెట్ ఫ్లిక్ లోకి రాగానే కొంతమంది వీక్షించేందుకు ఉత్సహం చూపించారు.
మరి టెస్ట్ ప్రేక్షకులను మెప్పించిందా.. లేదా అనేది మినీ సమీక్షలో చూసేద్దాం..
మాధవన్ శరవణన్ గా ఫెయిల్యూర్ సైన్టిస్ట్ పాత్రలో సిద్దార్థ్ క్రికెటర్ గా అర్జున్ పాత్రలో నయనతార టీచర్ గా కుముదిని పాత్రలో బెస్ట్ పెరఫార్మెన్స్ ఇచ్చినా వీక్ నేరేషన్ ఆడియన్స్ కి పరీక్షలా మారింది. మాధవన్, నయనతార, సిద్దార్థ్ ఇలా ముగ్గురు పాత్రల నడుమ తిరిగే కథ టెస్ట్. నటీనటుల పెర్ఫార్మెన్స్ ఎంత బావున్నప్పటికీ మంచి కథ, కథనం లేకపోతే ఆడియన్స్ కు సినిమా బోర్ కొట్టేస్తుంది.
కూల్ గా నడుస్తున్న కథలోకి సడన్ ట్విస్ట్ షాకివ్వాలి కానీ, చెత్తగా అనిపించకూడదు. అసలు కథ సడెన్ గా ఎందుకు ఎండ్ అవుతుందో అర్థం అవదు, ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ ప్రేక్షకుడికి ఎక్కదు, కథలో బలం లేదు, దానికి తోడు నిడివి పెద్ద పరీక్షలా మారింది.
మరోపక్క స్ట్రీమింగ్ కి ముందు ఎలాంటి హైప్ లేని టెస్ట్ కి స్ట్రీమింగ్ అయ్యాక నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవడం అన్ని టెస్ట్ కి పరీక్షగా మారింది. నయనతార, మాధవన్, సిద్దార్ద్, మీరా జాస్మిన్ లాంటి స్టార్స్ ని పెట్టుకుని కంటెంట్ లో బలం లేకపోవడం మాత్రం టెస్ట్ కి బ్యాడ్ లక్ అనే చెప్పాలి.