రేపు ఏప్రిల్ 8 ఈపాటికి కల్లా సోషల్ మీడియా మొత్తం మోత మోగిపోద్ది. ఎందుకంటే ముగ్గురు టాలీవుడ్ స్టార్స్ బర్త్ డే ఏప్రిల్ 8 నే కావడం. అందులో ఇప్పటికే పాన్ ఇండియా స్టేటస్ మైంటైన్ చేస్తున్న అల్లు అర్జున్ ఒకరు, రెండోవారు స్టార్ హీరో అయ్యేందుకు కష్టపడుతున్న అక్కినేని ప్రిన్స్ అఖిల్. మూడోవారు ఎప్పుడెప్పుడు హీరోగా తెరంగేట్రం చేస్తాడా అని ఎదురుచూస్తున్న కొణిదెల కుర్రోడు, పవన్ వారసుడు అకీరా నందన్.
Allu Arjun : పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే అంటే ఇప్పడు చాలా ప్రత్యేకం. ఆయన నుంచి బిగ్ అప్ డేట్స్ రాబోతున్నట్టుగా నిర్మాతలు హింట్ ఇచ్చేసారు. అల్లు అర్జున్ అట్లీ కాంబో ని ఓ స్పెషల్ వీడియో తో అనౌన్స్ చెయ్యబోతున్నారు. అంతేకాదు త్రివిక్రం-అల్లు అర్జున్ ప్రాజెక్ట్ అనౌన్సమెంట్ షాకింగ్ గా ఉండబోతుంది అని ఆ నిర్మాత అప్ డేట్ ఇచ్చారు. సో రేపు ఈ సమయానికి అల్లు అర్జున్ కొత్త సినిమాల అప్ డేట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి.
Akhil Akkineni : అక్కినేని అఖిల్ బర్త్ డే కి #Akhil 6 నుంచి క్రేజీ కాదు మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నట్టుగా మేకర్స్ ప్రీ లుక్ పోస్టర్ తో బిగ్ అప్ డేట్ అందించారు అక్కినేని అభిమానులకి. అఖిల్ నెక్స్ట్ అప్ డేట్ కోసం అక్కినేని అభిమానులు రెండేళ్లుగా చాలా ఆతృతగా ఉన్నారు. రేపు అది నెరవేరబోతోంది.
Akira Nandan : పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ బర్త్ డే కూడా రేపే. మరి అకీరా ఎప్పుడెప్పుడు హీరోగా తమ ముందుకు వస్తాడా అని పవన్ కళ్యాణ్ అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని కూర్చున్నారు. ఆ సమయం ఎప్పుడొచ్చినా అకీరా బర్త్ డే ని మాత్రం మెగా అభిమానులు, పవన్ అభిమానులు చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేస్తారు.
ఏప్రిల్ 8 న ఈ ముగ్గురు బర్త్ డే లకు రాబోయే అప్ డేట్స్ తో సోషల్ మీడియా మోత మోగిపోద్ది అంటూ అప్పుడే నెటిజెన్స్ సరదాగా మాట్లాడుకుంటున్నారు.