Advertisementt

ఎక్స్ట్రార్డినరీ గా ఉండబోతున్న రాజాసాబ్ టీజర్

Mon 07th Apr 2025 10:46 AM
raja saab  ఎక్స్ట్రార్డినరీ గా ఉండబోతున్న రాజాసాబ్ టీజర్
Raja Saab teaser is going to be extraordinary ఎక్స్ట్రార్డినరీ గా ఉండబోతున్న రాజాసాబ్ టీజర్
Advertisement
Ads by CJ

రాజా సాబ్ ఏప్రిల్ నుంచి పోస్ట్ పోన్ అయ్యింది. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారో అనే విషయంలో ప్రభాస్ అభిమానులు చాలా ఆతృతగా కనబడుతున్నారు. కొంతమంది రాజా సాబ్ సెప్టెంబర్ అంటే కొంతమంది దసరా అంటున్నారు. దర్శకుడు మారుతి రాజా సాబ్ విషయంలో మీరు కంగారు పెట్టకపోతే నా పని నేను కూల్ గా చేసుకుంటాను అంటారు. 

అయితే రాజా సాబ్ టీజర్ పై ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో వార్తలు వినబడుతున్నాయి. ఇప్పటికే రాజా సాబ్ టీజర్ కట్ జరిగింది, దానికి సంబందించిన డబ్బింగ్, మిగతా అన్ని పనులు పూర్తయ్యాయని, ఇండస్ట్రీలోని కొంతమంది ప్రముఖులు రాజా సాబ్ టీజర్ వీక్షించారనే వార్త ప్రభాస్ అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. 

రాజా సాబ్ టీజర్ చూసిన వారు మారుతి నెక్స్ట్ లెవల్ డైరెక్షన్, మారుతి 2.ఓ, ఇన్నిరోజులు మారుతి అంటే కామెడీగా చూసేవారు, మారుతి కూడా రాజా సాబ్ తో అగ్ర దర్శకుల్లో చేరబోతున్నాడు అనిపించేలా రాజా సాబ్ ఉండబోతుంది. పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ కి రాజా సాబ్ తో కొత్త వచ్చే క్రేజ్ ఏమి లేకపోయినా, మారుతి మాత్రం టాప్ డైరెక్టర్ లిస్ట్ లోకి చేరబోతున్నాడు. 

రాజా సాబ్ టీజర్ ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది, టీజరే ఇలా ఉంది అంటే సినిమా ఏ లెవల్లో ఉండబోతుందో ఊహించవచ్చు అంటూ రాజా సాబ్ టీజర్ చూసిన వాళ్ళు చేస్తున్న కామెంట్స్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు.

Raja Saab teaser is going to be extraordinary:

The Raja Saab - A new teaser to be released soon

Tags:   RAJA SAAB
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ