టాలెంటెడ్ బ్యూటీ అభినయ పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైంది. గతంలో హీరో విశాల్ తో అభినయ ప్రేమలో ఉంది, త్వరలోనే విశాల్-అభినయ వివాహం చేసుకోబోతున్నారని వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చిన అభినయ తన బాయ్ ఫ్రెండ్ సన్నీ వర్మ ని వివాహమాడేందుకు సిద్ధమని ప్రకటించిన కొద్దిరోజులకే నిశ్సితార్ధం చేసుకుంది.
కాబోయే భర్తను పరిచయం చెయ్యకుండా కేవలం చేతి ఉంగరాలతో ఎంగేజ్మెంట్ విషయం బయటపెట్టిన అభినయ రీసెంట్ గా తన ఫియాన్సీ ఫొటోస్ ని రివీల్ చేసింది. సన్నీ వర్మతో కలిసి అభినయ కేక్ కట్ చేసే ఫోటో షేర్ చేసింది. ఇక ఇప్పుడు అభినయ-సన్నీ వర్మల వివాహానికి తేదీ నిశ్చయించినట్టుగా తెలుస్తోంది.
ఏప్రిల్ 16 అంటే ఈ నెలలోనే అభినయ పెళ్లి పీటలెక్కబోతున్నట్టుగా, అభినయ వివాహానికి పెద్దలు ఏప్రిల్ 16 వ తేదీని నిశ్చయించారని అంటున్నారు. అభినయ వివాహం చెన్నైలో జరగబోతున్నట్టుగా సమాచారం.