అఖిల్ అక్కినేని నుంచి కొత్త సినిమా కబురు కోసం, అలాగే అఖిల్ పెళ్లి కబురు కోసం అక్కినేని అభిమానులు చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. ఏప్రిల్ 8 అఖిల్ బర్త్ డే కి ట్రీట్ ఇవ్వబోతున్నట్టుగా నిర్మాత నాగవంశీ అప్ డేట్ ఇచ్చేసారు. #Akhil6 నుంచి అభిమానుల కోసం ట్రీట్ సిద్దమవుతుంది.
ఇక నాగార్జున తన చిన్న కొడుకు అఖిల్ పెళ్లి కబురు ఎప్పుడు చెబుతారా అని అక్కినేని ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. మార్చ్ లో అఖిల్-జైనబ్ ల వివాహం ఉంటుంది అని అన్నప్పటికి అలాంటిదేం జరగలేదు. ఇక అఖిల్ కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు అనుకుంటే తనకు కాబోయే భార్య జైనబ్ తో సరదాగా చక్కర్లు కొడుతున్నాడు.
ఈరోజు శ్రీరామనవమి రోజున అఖిల్ తనకు కాబోయే భార్య జైనబ్ తో కలిసి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించడమే కాదు జైనబ్ చెయ్యి పట్టుకుని అఖిల్ నడిచొస్తుంటే అభిమానులు చాలా సంతోషపడిపోతున్నారు. అఖిల్ కి ముందుగా బర్త్ డే విషెస్ చెప్పడమే కాదు, తొందరగా పెళ్లి చేసుకోమంటూ అఖిల్ ని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.