సమ్మర్ హాలిడేస్ మొదలైపోయాయి. ఇంటర్, 10th పరీక్షలు పూర్తయ్యాయి. కాలేజీలకు సెలవులొచ్చాయి. కానీ బాక్సాఫీస్ బోసుమంటుంది. గత వారం అంటే ఉగాది వీక్ లో నాలుగైదు పేరున్న సినిమాలు పోటీపడ్డాయి. కానీ ఈ వారం చిన్న సినిమాలే రిలీజ్ కావడంతో బాక్సాఫీసు వుసూరుమంది, రామ్ గోపాల్ వర్మ శారీ, నవీన్ చంద్ర 28c, LYF లాంటి చిత్రాలు థియేటర్స్ లో విడుదలయ్యాయి.
ఇక ఓటీటీ నుంచి నేరుగా నయనతార-మాధవన్, సిద్దార్థ్ ల టెస్ట్ చిత్రం నెట్ ఫ్లిక్స్ నుంచి అందుబాటులోకి వచ్చింది, అలాగే హోమ్ టౌన్ అనే చిత్రం ఆహా నుంచి అందుబాటులోకి రాగా అందులో ఒక్క చిత్రము ఆడియన్స్ ను ఇంప్రెస్స్ చేయకపోగా అన్ని బోర్ కొట్టించే సినిమాలే కావడం గమనార్హం.
మరి వేసవి సెలవల్లో అలా కాసేపు బయట తిరిగి సినిమా చూసి రిలాక్స్ అవుదామనుకుంటే ఈవారం ఆయమన్న చిత్రాలే లేవు. ఏప్రిల్ రెండో వారంలో సిద్దు జొన్నలగడ్డ జాక్, అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, జాట్ హిందీ డబ్బింగ్, ప్రదీప్ మాచిరాజు అక్కడ అమ్మాయి ఇక్కడఆబ్బాయి చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.
ఏప్రిల్ 3వ వారంలో మాత్రం క్రేజీ మిడియం రేంజ్ చిత్రాలు పోటీకి రాబోతున్నాయి. ఏప్రిల్ 17 ఓదెల 2, ఏప్రిల్ 18 అర్జున్ సన్ ఆఫ్ వైజయంతితో కళ్యాణ్ రామ్, ప్రియదర్శి సారంగపాణి జాతకం చిత్రాలు రాబోతున్నాయి. సో ఈ నెలలో కూడా ఎలాంటి బిగ్ బడ్జెట్ చిత్రము విడుదల కాకపోవడం అనేది ప్రేక్షకులను నిరాశ పరిచే విషయమే.