Advertisementt

శ్రద్ద కపూర్ పై డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు

Sun 06th Apr 2025 02:29 PM
shraddha kapoor  శ్రద్ద కపూర్ పై డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు
Shraddha Kapoor Fans ANGRY Over Dinesh Vijan శ్రద్ద కపూర్ పై డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో స్త్రీ 2 తో తెగ ఫేమస్ కాదు క్రేజీ హీరోయిన్ గా మారిన శ్రద్ద కపూర్ పై బాలీవుడ్ నిర్మాత దినేశ్ విజయ్, దర్శకుడు అమర్ కౌశిక్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి, శ్రద్ద కపూర్ దెయ్యంలా నవ్వుతోంది, అందుకే స్త్రీ 2 అవకాశం దక్కింది అంటూ అమర్ కౌశిక్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై శ్రద్ద కపూర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

స్త్రీ 2లో శ్రద్ద కపూర్ హీరోయిన్ గా ఎంపిక చెయ్యడానికి కారణం ఆమె నవ్వే, ఆమె దెయ్యంలా నవ్వుతుంది, అందుకే స్త్రీ 2 కి మరో చాయిస్ లేకుండా శ్రద్ద కపూర్ ని తీసుకున్నాం అంటూ స్త్రీ 2 డైరెక్టర్ అమర్ కౌశిక్ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. స్త్రీ 2 కోసం హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చెయ్యాలా అని ఆలోచిస్తున్న సమయంలో దినేష్ తనకు శ్రద్ద కపూర్ పేరు సూచించారు.  

దానికి కారణం ఒకేసారి శ్రద్ధాకపూర్‌, దినేశ్‌ విజయ్ ఒకే ఫ్లైట్‌లో ప్రయాణించారని, ఆ సమయంలో జరిగిన సంభాషణలో శ్రద్ధ అచ్చం దెయ్యంలా నవ్వుతుందని, అందుకే స్త్రీ 2లో పాత్రకు శ్రద్ధనే పూర్తి న్యాయం చేయగలదని దినేశ్ విజయ్ తనతో చెప్పారని అమర్ కౌశిక్ చెప్పుకొచ్చారు. 

Shraddha Kapoor Fans ANGRY Over Dinesh Vijan :

Stree Director Comment on Shraddha Kapoor Angers Fans

Tags:   SHRADDHA KAPOOR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ