ట్రంప్ ఏమంటా రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యాడో అప్పుడే మోదయ్యాయి అక్కడి ప్రజలకు అసలు కష్టాలు, ఇండియా వారినే కాదు, మిగతా దేశాలవారిని కూడా ట్రంప్ సంస్కరణలు సమస్యల్లోకి నెట్టేశాయి. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి, పని చెయ్యడానికి పార్ట్ టైమ్ జాబ్స్ లేవు, అలాగని తమ దేశానికి పోలేరు. ట్రంప్ అద్యక్షుడయ్యాక రోజుకో కొత్త రూల్ పెడుతూ అందరిని ఇబ్బందుల్లో పడేస్తున్నారు.
ట్రంప్, ఎలన్ మస్క్ కలిసి చేసే పనులతో అమెరికా అంతా అతలాకుతలం అవుతుంది. ట్రంప్ వచ్చిన మూడు నెలలకే అమెరికన్లు విసిగి వేసారిపోయారు, ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు మిన్నంటాయి. ట్రంప్, మస్క్కు వ్యతిరేకంగా నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శన చేస్తూ అక్కడి ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు.
ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతుందన్న అంచనాలు మొదలైపోయాయి, వాణిజ్య యుద్ధాలు పెరుగుతాయని భయాలు నెలకొన్నాయి, ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపుపై నిరసన జ్వాల మొదలయ్యింది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక అమెరికా లో ఇదే అతి పెద్ద నిరసనగా తెలుస్తోంది. మరి ఐదేళ్లు పూర్తవ్వకుండానే అమెరికాలో ట్రంప్ పై వ్యతిరేఖ జ్వాలలు ఈ రేంజ్ లో మొదలు కావడం గమనార్హం.