రామ్ చరణ్ బర్త్ డే కి రావాల్సిన పెద్ది గ్లింప్స్ ఉగాది ని దాటుకుని మరో ఫెస్టివల్ శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేసారు మేకర్స్. రామ్ చరణ్ బర్త్ డే రోజున పెద్ది టైటిల్ తో పాటుగా, రామ్ చరణ్ పెద్ది మాస్ లుక్ రిలీజ్ చేసి మెగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చిన దర్శకుడు బుచ్చిబాబు గత రెండు రోజులుగా శ్రీరామనవమి రోజున అంటే ఈరోజు ఏప్రిల్ 6 న రాబోతున్న పెద్ది గ్లింప్స్ పై హైప్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు.
54 సెకన్స్ బ్లాస్టింగ్ పెద్ది గ్లింప్స్ అంటూ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ గ్లింప్స్ పై రామ్ చరణ్ కూడా మెగా ఫ్యాన్స్ లో అటెన్షన్ క్రియేట్ చేసే ట్వీట్లు వెయ్యడంతో.. అందరూ పెద్ది గ్లింప్స్ కోసం ఎదురు చూసేలా చేసింది. తాజాగా వదిలిన పెద్ది గ్లింప్స్ లోకి వెళితే.. ఒకటే పని చేసేనాకి.. ఒకేలాగా బతికేయ్యనాకి ఇంతపెద్ద బతుకెందుకు, ఏదైనా ఈ నేల మీదున్నప్పుడే చేసెయ్యాలా, పుడతామా ఏంటి మల్లి అంటూ రామ్ చరణ్ రాయలసీమ యాసలో చెప్పిన డైలాగ్స్ పెద్ది ఫస్ట్ షాట్ కి హైలెట్. ఈ సందర్భంగా మార్చి 27 అంటే వచ్చే ఏడాది 2026 రామ్ చరణ్ బర్త్ డే కి పెద్ది రిలీజ్ డేట్ లాక్ చేసి అనౌన్స్ చేసేసారు మేకర్స్.
అంతేకాదు పెద్ది గా రామ్ చరణ్ గెటప్, రామ్ చరణ్ పెద్ది మాస్ లుక్, క్రికెట్ ఆడుతూ కొట్టిన సిక్సర్ అన్ని పెద్ది గ్లింప్స్ కి హైలెట్ గా నిలిచాయి. రెహమాన్ మ్యూజిక్, బుచ్చి బాబు మేకింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని పెద్ది ఫస్ట్ షాట్ కి హైలెట్స్ అనే చెప్పాలి, పెద్ది ఫస్ట్ షాట్ చూసి మెగా ఫ్యాన్స్ అయితే శ్రీరామనవమి పండుగతో పాటుగా పెద్ది సంబరాలు చేసుకుంటున్నారు.