Advertisementt

మాలీవుడ్‌లో నంబ‌ర్ వ‌న్ గ్రాస‌ర్

Sun 06th Apr 2025 11:12 AM
l2  మాలీవుడ్‌లో నంబ‌ర్ వ‌న్ గ్రాస‌ర్
Number one grosser in Mollywood మాలీవుడ్‌లో నంబ‌ర్ వ‌న్ గ్రాస‌ర్
Advertisement
Ads by CJ

వందేళ్లు పైబ‌డిన భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో మ‌ల‌యాళ సినీప‌రిశ్ర‌మ‌కు ద‌శాబ్ధాలుగా ప్ర‌త్యేక గుర్తింపు ఉంది.  జాతీయ అవార్డులు కొల్ల‌గొట్ట‌డంలో, క్రిటిక్స్ మెప్పు పొంద‌డంలో ఈ ప‌రిశ్ర‌మ త‌ర్వాతే. మంచి క‌థ కంటెంట్ తో ఆక‌ట్టుకునే సినిమాల‌ను మాలీవుడ్ సృజ‌నాత్మ‌క ద‌ర్శ‌కులు అందించారు. అయితే మాలీవుడ్ క‌మ‌ర్షియ‌ల్ గా భారీ సంచ‌ల‌నాలు న‌మోదు చేయ‌లేద‌నే చెప్పాలి.

ఇప్ప‌టికీ మల‌యాళ చిత్ర‌సీమ‌లో 500 కోట్ల క్ల‌బ్ సినిమా లేదు. కేవ‌లం 200 కోట్ల క్ల‌బ్ వ‌ర‌కే ప‌రిమిత‌మైంది. 200 కోట్లు అంత‌కుమించి వ‌సూలు చేసిన సినిమాలు మాలీవుడ్ లో రెండే రెండు ఉన్నాయి. వాటిలో ఒక‌టి ఇటీవ‌లే విడుద‌లైన ఎల్ 2 ఎంపురాన్ కాగా, మ‌రొక‌టి మంజుమ్మెల్ బోయ్స్. ఎల్.2 ఎంపురాన్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా 250 కోట్ల గ్రాస్ అందుకోగా, మంజుమ్మెల్ బోయ్స్ 242 కోట్లు వ‌సూలు చేసింది.  ప్రపంచ బాక్సాఫీస్ అంచనాల ఆధారంగా అత్యధిక వసూళ్లు చేసిన మలయాళ చిత్రాలలో టాప్ 10 ర్యాంకింగ్స్ ని చూస్తే ఇలా ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసిన మల‌యాళ చిత్రాలలో 200 కోట్ల క్ల‌బ్ లో రెండు సినిమాలు చేర‌గా, 100 కోట్ల క్ల‌బ్ లో కేవ‌లం 10 సినిమాలు మాత్ర‌మే ఉన్నాయి. వాటి జాబితా వివ‌రాలు ఇలా ఉన్నాయి.

L2: ఎంపురాన్ రూ.250 కోట్లు (2025), మంజుమ్మెల్ బాయ్స్ రూ.242 కోట్లు (2024),  2018 రూ.177 కోట్లు (2023), ది గోట్ లైఫ్ రూ.158.50 కోట్లు (2024), ఆవేశం రూ.156 కోట్లు (2024), పులిమురుగన్ రూ.152 కోట్లు (2016), ప్రేమలు -136.25 కోట్లు (2024), లూసిఫెర్ రూ.127 కోట్లు (2019) , మార్కో రూ.115 కోట్లు (2024),  ARM రూ.106.75 కోట్లు (2024).

Number one grosser in Mollywood:

Malayalam industry records broken

Tags:   L2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ