ఉప్పెన బ్యూటీ, ఉప్పెన బ్యూటీ ఇప్పటికి కృతి శెట్టి ని అదే పేరుతొ పలుకుతున్నారు, కారణం ఉప్పెన చిత్రం తర్వాత ఆ రేంజ్ హిట్ కృతి శెట్టి కి రాలేదు కాబట్టి. శర్వానంద్ తో కృతి శెట్టి నటించిన మనమే చిత్రంలో కృతి శెట్టి గ్లామర్ ఒలకపొసింది, అయినా కానీ కృతి శెట్టి కి మాత్రం ఆఫర్స్ నిల్.
కోలీవుడ్ లో ఆఫర్స్ వస్తున్నా అమ్మడుకి అదృష్టం కలిసి రావడమే లేదు. అందుకే కృతి శెట్టి సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటో షూట్స్ అంటూ దర్శకనిర్మాతలకు వల వేస్తుంది. అందం ఉంది, గ్లామర్ ఉంది, కానీ ఆవగింజంత అదృష్టమే లేదు, అన్నట్టుగా కృతి శెట్టి కెరీర్ తయారైంది.
తాజాగా బేబమ్మ క్రితి శెట్టి సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ చూస్తే అమ్మో బేబమ్మ ఏమిటి అరాచకం అంటారేమో. అంతలాంటి గ్లామర్ షో తో కృతి శెట్టి మతిపోగొట్టింది. మతిపోగోట్టే అందాలతో మత్తెక్కిస్తున్న కృతి శెట్టి న్యూ పిక్స్ పై మీరు ఓ లుక్కెయ్యండి.