మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ కీలకపాత్రలో, పృథ్వీ రాజ్ సుకుమారన్ నటించన్ L2 ఎంపురాన్ గత గురువారం పాన్ ఇండియా మార్కెట్ లో విడుదలయ్యింది. మలయాళంలో బొమ్మ బ్లాక్ బస్టర్, మిగతా లాంగ్వేజెస్ లో సో సో టాక్ తో సరిపెట్టుకున్న L 2 ఎంపురాన్ వివాదాలతో సతమతమవుతోంది.
మత విద్వేషాలను రోచ్చగొట్టేదిలా ఉన్నాయని L 2 ఎంపురాన్ లోని కొని డైలాగ్స్ పై కాంట్రవరీస్ మొదలు కాగా.. మేకర్స్ ఎంపురాన్ చిత్రానికి తిరిగి ఎడిటింగ్ చేసారు, ఆ గొడవ ట్రెండింగ్ లో ఉన్న సమయంలోనే L 2 ఎంపురాన్ నిర్మాతపై ఐటి రైడ్స్ షాకిచ్చాయి. నిర్మాత గోకుల్ ఇంట్లో, ఆఫీసుల్లో ఐటి రైడ్స్ జరపగా అందులో 1000 కోట్ల మేర అక్రమ సంపాదన ఉన్నట్లుగా అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.
మరోపక్క L 2 ఎంపురాన్ దర్శకుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ కి కూడా ఐటి నోటీసులు అందాయి. అది ఆయన డైరెక్ట్ చేసి నటించిన చిత్రాలు కడువ, జనగణమన, గోల్డ్ చిత్రాల విషయంలో రెమ్యునరేషన్ కి సంబందించిన లెక్కలు చెప్పాలని పృథ్వీ రాజ్ సుకుమారన్ ఐటి అధికారులు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.