ఇండియన్ ఇండస్ట్రీకి జూనియర్ ఎన్టీఆర్ ఒక వరం, ఎన్టీఆర్ ఇంకా ఎత్తుకు ఎదుగుతాడు, రెండు మూడు పేజీల డైలాగ్స్ ని అనర్గళంగా చెప్పగలడు అంటూ ఎన్టీఆర్ చిన్నత్త పురందరేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరావు జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. తాజాగా దగ్గుబాటి వెంకటేశ్వరావు హోమ్ టూర్ అంటూ ఓ ఛానల్ యాంకర్ ఆయన్ని కలిశారు.
అందులో భాగంగా మీ మేనల్లుడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో మీకు ఏ సినిమా ఇష్టం అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన కాస్త ఆలోచిస్తూ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అతను ఇండియన్ ఇండస్ట్రీకి ఒక వరం, ఇప్పుడు అంతా పాన్ ఇండియా అయ్యింది కదా, అతనిలో ఉన్న టాలెంట్ మాములు టాలెంట్ కాదు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం ఏమిటి ఇప్పడు జపాన్ వెళ్లి జపనీస్ లాంగ్వేజ్ కూడా మాట్లాడేస్తున్నాడు.
అతను ఇంకా చాలా ఎత్తుకు ఎదుగుతాడు, అదే నేను అనుకుంటాను, అతనిలో ఆ లక్షణాలు ఉన్నాయి. అతనికి కూడా దేవుడి అనుగ్రహం ఉంది అంటూ వెంకటేశ్వరావు ఆ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ క్లిప్స్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు.