Advertisementt

కల్కి 2 పై నాగ్ అశ్విన్ క్రేజీ అప్ డేట్

Sat 05th Apr 2025 03:47 PM
nag ashwin  కల్కి 2 పై నాగ్ అశ్విన్ క్రేజీ అప్ డేట్
Nag Ashwin crazy update on Kalki 2 కల్కి 2 పై నాగ్ అశ్విన్ క్రేజీ అప్ డేట్
Advertisement
Ads by CJ

కల్కి 2898 AD చిత్రం గత ఏడాది జూన్ లో విడుదలై సెన్సేషనల్ హిట్ అయ్యింది. క్రేజీ నటులు ప్రభాస్, అమితాబ్, దీపిక కలయికలో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం అభిమానులనే కాదు పాన్ ఇండియా ఆడియన్స్ ను కూడా ఇంప్రెస్స్ చేసింది. దానికి సీక్వెల్ గా కల్కి 2 అంటూ ప్రకటించారు, కానీ కల్కి 2 షూటింగ్ అసలు మొదలు పెట్టలేదు. 

ప్రభాస్ రాజా సాబ్, అటు హను రాఘవపూడి మూవీ తో పాటుగా అతి త్వరలోనే ఆయన స్పిరిట్ మూవీ ని కూడా మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. అయితే కల్కి 2 ఏప్రిల్ నుంచి ఉంటుంది అని ఆ మధ్యన నిర్మాత అశ్విని దత్ గారు సెలవిచ్చారు, కానీ కల్కి 2 షూటింగ్ ఇప్పుడప్పుడే మొదలయ్యేలా లేదు, అదే విషయాన్ని తిరుమలలో నాగ్ అశ్విన్ కూడా చెప్పారు. 

ఈరోజు విఐపి బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి దర్శించుకుని బయటికి వచ్చిన నాగ్ అశ్విన్ ని మీడియా కల్కి 2 అప్ డేట్ గురించి అడిగారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్స్ జ‌రుగుతున్నాయ‌ని, కల్కి 2 సెట్స్ పైకి వెళ్ల‌డానికి చాలా టైమ్ ప‌డుతుంద‌ని నాగ్ అశ్విన్ తెలపడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Nag Ashwin crazy update on Kalki 2:

Nag Ashwin gives an update on Kalki 2 at Tirumala

Tags:   NAG ASHWIN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ