ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడా చూసినా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీడియోస్, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన ఫొటోస్ మాత్రమే ట్రెండ్ అవుతున్నాయి. కారణం గత రాత్రి ఎన్టీఆర్ మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్ కి వెళ్లారు. అక్కడ ఆయన తన సినిమాలపై ఇచ్చిన అప్ డేట్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి.
మరో పక్క హిందీ లో వార్ 2 తో తన డెబ్యూ ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తి చేసారు ఎన్టీఆర్. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. తాజాగా హృతిక్ రోషన్ ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవడం కాదు ఎన్టీఆర్ రేంజ్ ని తెలియజేస్తున్నాయంటూ ఎన్టీఆర్ అభిమానులు సంబరపడిపోతున్నారు.
రీసెంట్ గా హృతిక్ రోషన్ ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం విన్నాక ఎన్టీఆర్ హృతిక్ ని ఎంతగా ఇంప్రెస్స్ చేసి ఉంటాడో అని మాట్లాడుకుంటున్నారు. హృతిక్ ని మీ ఫేవరెట్ కో స్టార్ ఎవరు అంటే వెంటనే జూనియర్ ఎన్టీఆర్ అంటూ చెప్పడం విశేషం. హృతిక్ రోషన్ ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఎంతోమంది స్టార్స్ తో కలిసి పని చేసారు, అయినప్పటికి ఆయన ప్రత్యేకంగా ఎన్టీఆర్ పేరుని ప్రస్తావించడం మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఎగ్జైట్ అయ్యేలా చేసింది.