బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హిట్స్ తో క్రేజీగా మారి.. ఈ ఏడాది ఛావా తో బ్లాక్ బస్టర్ హిట్ లో భాగమైన రష్మిక మందన్నకు రీసెంట్ గా సల్మాన్ ఖాన్ సికిందర్ బిగ్ షాక్ ఇచ్చింది. సికందర్ చిత్రం మొదటి రోజే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఆతర్వాత ఈ చిత్రం అసలు న్యూస్ లో లేకుండా పోయింది.
ఇక సికందర్ రిలీజ్ రోజే తన ఫ్రెండ్ విజయ్ దేవరకొండ తో ముంబై లో లంచ్ డేట్ లో కనబడిన రష్మిక మందన్న తాజాగా ఒమన్ లో తేలింది. అక్కడ ఒమన్ లో రష్మిక రిలాక్స్ అవుతూ ఎంజాయ్ చేస్తుంది అంతేకాదు ఈ రోజు ఏప్రిల్ 5 న తన బర్త్ డే వేడుకలను స్నేహితులు నడుమ ఒమన్ లోనే సెలెబ్రేట్ చేసుకోబోతుంది ఈ చిన్నది.
ఒక పక్క కాలి గాయం ఇబ్బంది పెడుతుండగా, మరోపక్క వరుస సినిమాలతో రష్మిక అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్‌లో బిజీ బిజీగా గడుపుతున్న క్రమంలో షూటింగ్స్ నుంచి కాస్త విరామం తీసుకుని రిలీఫ్ కావాలని రష్మిక తన ఫ్రెండ్స్ తో కలిసి ఒమాన్ ట్రిప్ వేసినట్లుగా, అక్కడే ఆమె కొద్దిరోజులు ఉంటుంది అని సమాచారం.