కొన్నాళ్లుగా పాన్ ఇండియా మూవీస్ అంటూ సౌత్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీసుని షేకాడిస్తున్నాయి. అక్కడ హిందీలో ఏడాదికి ఒకటో అరో సినిమాలు మాత్రమే వర్కౌట్ అవుతున్నాయి. దానితో అక్కడి ప్రముఖుల మనస్సులో అసహనం పెరిగిపోతుంది. ఇప్పటికే అనురాగ్ కశ్యప్ లాంటి వాళ్ళు బాలీవుడ్ ఇండస్ట్రీని వదిలేసి వచ్చేసారు.
తాజాగా సౌత్ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఇండస్ట్రీపై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. హిందీ ఇండస్ట్రీ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. త్వరలోనే బాలీవుడ్ కి మంచి రోజులు వస్తాయి. సౌత్ లో తెరకెక్కే సినిమాలకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. సౌత్ ఇండస్ట్రీ ఇంతటి స్థానానికి చేరుకోవడానికి ఎంతోమంది కృషి ఉంది.
నార్త్ ఆడియన్స్ సౌత్ సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు, ఒకప్పుడు సౌత్ సినిమాలకు నార్త్ లో సరైన గుర్తింపు ఉండేది కాదని అన్నారు. బాలీవుడ్ లో ఇప్పుడు ఒక లోటు ఏర్పడిందని, ఆ లోటును కొత్త దర్శకులు తీరుస్తారని చెప్పిన విజయ్ దేవరకొండ ఆ కొత్త దర్శకులు మాత్రం ముంబైకి సంబంధం లేకుండా బయటివారే అయి ఉంటారని అనిపిస్తోంది అంటూ నార్త్ పై చేసిన వ్యాఖ్యలు సెన్సేషనల్ గా మారాయి.