యంగ్ హీరో నితిన్ వరస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. ఇప్పటివరకు ఒక లెక్క రాబిన్ హుడ్ తర్వాత ఒక లెక్క అంటే రాబిన్ హుడ్ కూడా నితిన్‌ని డిజప్పాయింట్ చేసింది. వెంకీ కుడుముల కూడా నితిన్ ఫేట్ మార్చలేకపోయాడు. వరసగా డిజాస్టర్స్ పడుతున్నాయి, రాబిన్ హుడ్ నితిన్‌కి ఓ లెసన్ అవ్వాలి, కుర్ర హీరోలు కథల ఎంపికలో శ్రద్ధ పెట్టాలంటూ విమర్శలు మొదలయ్యాయి.
ఇప్పుడు నితిన్ నుంచి రాబోయే తమ్ముడు చిత్రంపై నితిన్ ఫోకస్ పెట్టాలి, సాదా సీదా కంటెంట్‌తో వస్తే ప్రేక్షకులు ఒప్పుకోరు, గ్లామర్ యాడ్ అయినా, క్రికెటర్ యాడ్ అయినా ఎవరూ కాపాడలేరు అంటూ నితిన్‌కి సజషన్స్ ఎక్కువవుతున్నాయి. నితిన్ తమ్ముడు చిత్రాన్ని మే 9 న రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో అనే ఆలోచనలో ఉన్నాడట.
బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ లు ఎందుకు తమ్ముడు చిత్రాన్ని ఇంకాస్త వేచి చూసాక రిలీజ్ చేస్తే బావుంటుంది అంటున్నారు. మరి దర్శకుడు వేణు శ్రీరామ్ నితిన్‌కి తమ్ముడుతో ఎలాంటి రిజల్ట్ ఇస్తాడో అనేది కాస్త వేచి చూస్తే తెలుస్తోంది.