మోహన్ లాల్ - పృధ్వీ రాజ్ సుకుమార్ కాంబినేషన్ లో లూసిఫర్ కి సీక్వెల్ గా రూపొందిన L 2 ఎంపురాన్ వస్తోంది, ఈ సీక్వెల్ సాంప్రదాయానికి విరుద్ధంగా ఫస్ట్ పార్ట్ తర్వాత చూపిస్తాం ముందు సెకండ్ పార్ట్ చూడండి అంటూ చియాన్ విక్రమ్ వీర ధీర శూర సిద్ధమైంది, మ్యాడ్ హుమార్ తో యూత్ ని ఆకట్టుకున్న సినిమా మ్యాడ్ స్క్వేర్ వచ్చింది.. ఈ మూడు సినిమాల మధ్యలో రాబిన్ హుడ్ గా దిగాడు నితిన్.
ఇటీవల కాలంలో వరుసగా ఫ్లాప్స్ చవి చూస్తున్న ఇతనికి కచ్చితంగా ఈ రాబిన్ హుడ్ ఊతమిచ్చే సినిమా అవుతుంది అనుకున్నారంతా, ఎందుకంటే అంతకుముందే కోవిడ్ టైమ్ లోనే నితిన్ కి భీష్మ వంటి సక్సస్ అందించిన దర్శకుడు వెంకీ కుడుముల భరోసా గా ఉన్నాడు, యూత్ ని ఆకర్షించే హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా యాడ్ అయ్యింది, డేవిడ్ వార్నర్ వంటి స్టార్ట్ క్రికెటర్ ఎంట్రీ తోడైంది.. ఈసారి కన్ఫర్మ్ గా నితిన్ సక్సెస్ కొడతాడనే అనుకున్నారంతా. కానీ సీన్ రివర్స్ అయింది.. సంక్రాంతికి వస్తున్నాం స్టైల్ లో రీల్స్ చేశారు. సభా వేదికలపై అహో అంటూ అదరగొట్టారు.. కానీ డేవిడ్ వార్నర్ ఇన్వాల్మెంట్ సినిమా మొత్తంలో వన్ మినిట్ కి పరిమితం చేసేసారు.. అధిద సర్ప్రైజ్ అంటూ ఎన్నో విమర్శలనందుకున్న డాన్స్ మూమెంట్ సినిమా నుంచి తీయాల్సి వచ్చింది.. ఎంత ప్రమోట్ చేసినా సినిమా తేలిపోయింది, ఫస్ట్ వీకెండ్ కే పక్కకి వెళ్లిపోయింది..
ఇక ఈవారం రిలీజ్ ల విషయానికి వస్తే చెప్పుకోవడానికి సంఖ్యా పరంగా గట్టిగానే ఉన్నప్పటికి చెప్పుకోదగ్గ సినిమాలు ఏమి లేవు అన్ని చిన్న సినిమాలే, ఒక డేట్ దొరికింది కదా అని థియేటర్స్ లో వాలిపోతున్నావే, బాక్స్ ఆఫీస్ ని వేడుకుంటున్నావే..
సినీ విశ్లేషకుల మాట ఏమిటంటే ఎప్పుడో రిలీజ్ కి సిద్ధమైన సినిమాని అంత కాలం అట్టిపెట్టుకొని అంతటి కాంపిటీషన్ లో ఆ వారం దించకుండా, ఈ వారాన్ని ఎంచుకొని ఉంటే ఈ ఫ్రైడే కి ఇదే పెద్ద సినిమా అయ్యేది, ఇప్పుడు పొందిన పలితం కంటే ఇంకొంచం బెటర్ రిజల్ట్ తీసుకోచ్చి ఉండేది అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.. నితిన్ ఇకనైనా కథలు ఎంచుకోవడం పైనే కాదు కాంబినేషన్ సెట్ చేసుకోడం పైనే కాదు, రిలీజ్ డేట్స్ ను కూడా కాస్త చూసుకోవాలి.
లేకపోతే ఇష్క్ సినిమా ముందు అతని అపజయాల అనుభవం రిపీట్ అయ్యే అవకాశం ఉంది.. ఇప్పటికైతే ఈ రాబిన్ హుడ్ బాక్స్ ఆఫీస్ ని దోచుకోవడం లో పూర్తిగా విఫలం అయ్యాడు కానీ తన ఫేవరెట్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా పేరుతో వకీల్ సాబ్ డైరెక్టర్ తో తమ్ముడు అనే తన నెక్స్ట్ సినిమా రిలీజ్ కి సిద్ధం చేస్తున్న నితిన్ ప్రమోషన్స్ విషయంలోనూ రిలీజ్ డేట్ విషయంలోనూ జాగ్రత్త పడితే బాగుంటుంది అంటున్నారు సినీ విశ్లేషకులు.