Advertisementt

మనోజ్ కుమార్తె బర్త్ డే లో అదే లోటు

Thu 03rd Apr 2025 06:15 PM
manchu manoj  మనోజ్ కుమార్తె బర్త్ డే లో అదే లోటు
Manchu Manoj pens adorable post for daughter on her first birthday మనోజ్ కుమార్తె బర్త్ డే లో అదే లోటు
Advertisement
Ads by CJ

మంచు మనోజ్ ప్రస్తుతం తన భార్య మౌనిక అలాగే పిల్లలతో కలిసి మంచు ఫ్యామిలీ కి దూరంగా ఉంటున్నాడు, మంచు ఆస్తి తగాదాలతో మంచు మోహన్ బాబు మనోజ్ ని దూరం పెట్టడం, మనోజ్ మోహన్ బాబు కి ఎదురు తిరగడం, ఇప్పటికి ఆ కేసుల్లో విచారణకు హాజరవుతున్నారు మోహన్ బాబు, మనోజ్ లు. రీసెంట్ గా ఉగాది వేడుకల్లో మోహన్ బాబు ఆయన భార్య, మంచు విష్ణు ఫ్యామిలీ మాత్రమే కనిపించారు. 

తాజాగా మనోజ్ తన కుమార్తె దేవసేన ఫస్ట్ బర్త్ డే కి మనోజ్ సోషల్ మీడియా వేదికగా ఫోటోలను పంచుకోవడమే కాదు, కూతురికి బర్త్ డే విషెస్ తెలియజేసాడు. ఏడాది క్రితం మా ప్రపంచం అద్భుతంగా మారిపోయింది. ముగ్గురుగా ఉన్న మేము నలుగురం అయ్యాం. నాలుగు హృదయాలు, నాలుగు ఆత్మలు, ఒక తిరుగులేని బంధం. 

అద్భుతం, ఆరోగ్యం, అందమైన కలలతో నిండిన కుటుంబాన్ని కలిసి నిర్మించుకుందాం, నీకు మొదటి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మాటల్లో కంటే నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాను అంటూ మనోజ్ కూతురు బర్త్ డే ఫొటోస్ షేర్ చెయ్యగా.. అయ్యో ఈ ఫొటోల్లో మంచు పూర్తి ఫ్యామిలీ అంటే మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి ఉంటే బావుండేది, వారు లేరుగా అంటూ మంచు ఫ్యాన్స్ ఫీలైపోతున్నారు.

Manchu Manoj pens adorable post for daughter on her first birthday:

Manchu Manoj recently shared a touching Instagram post celebrating his daughter DevaSena first birthday

Tags:   MANCHU MANOJ
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ