బబ్లీ గర్ల్ రాశి ఖన్నా కొన్నాళ్ళుగా స్లిమ్‌గా తయారై, గ్లామర్ ప్రదర్శనతో చూపరుల మతిపోగొడుతోంది. ఎప్పుడు గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత నిచ్చే రాశి ఖన్నా ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీని వదిలి ముంబైలో సెటిల్ అయ్యే పనిలో ఉంది. అక్కడే హిందీ వెబ్ సీరీస్, హిందీ సినిమాలతో బిజీగా మారబోతుంది.
తెలుగులో నితిన్‌తో కలిసి తమ్ముడు ప్రాజెక్ట్‌లో నటిస్తున్న రాశి ఖన్నాకి.. సౌత్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ ఏమి చేతిలో లేదు. ఈ క్రమంలో ముంబైలోనే ఉండి అక్కడే అవకాశాలు వెతుక్కుంటున్న రాశి ఖన్నా ఈ మధ్యన స్లిమ్‌గా, నాజూగ్గా తయారైంది. అయితే రాశి ఖన్నా అంతగా స్లిమ్ అవడానికి గల సీక్రెట్ బయటికి వచ్చింది.
రాశి ఖన్నా అంతగా స్లిమ్ అవడానికి కారణం ఆమె జిమ్‌లో హెవీ వర్కౌట్స్ చేస్తుండమే. జిమ్‌లో చమటలు చిందిస్తూ రకరకాల వర్కౌట్స్ చేస్తున్న జిమ్ వీడియోని షేర్ చేయగానే.. బాలీవుడ్ మీడియా ఆ వీడియోని తెగ పబ్లిసిటీ చేస్తుంది. ప్రస్తుతం రాశి ఖన్నా జిమ్ సీక్రెట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.