అక్కినేని అఖిల్, జైనబ్‌ల వివాహం మార్చిలో అంటూ ప్రచారం జరగడమే కానీ మార్చి కూడా వెళ్లిపోయింది. మరి అక్కినేని ప్రిన్స్ అఖిల్ పెళ్లి పీటలెప్పుడెక్కుతాడా? అని అక్కినేని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. మార్చి 24న అఖిల్-జైనబ్ ల వివాహం జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది.
కానీ అక్కినేని ఇంట ఎలాంటి సందడి కనిపించడం లేదు. గత ఏడాది నవంబర్‌లోనే అఖిల్-జైనబ్‌ల నిశ్చితార్ధాన్ని నాగార్జున తన ఇంట్లోనే కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్‌గా జరిపించేసి అఖిల్ ఎంగేజ్మెంట్ విషయాన్ని రివీల్ చేశారు. ఆ తర్వాత అఖిల్-జైనబ్‌లు నాగ చైతన్య-శోభితల పెళ్లి వేడుకలో మెరిశారు.
ఆ పెళ్లి అనంతరం దుబాయ్ వెళుతూ ఎయిర్ పోర్ట్‌లో అఖిల్-జైనబ్ జంట కనిపించింది. మరి నాగార్జున, అఖిల్ పెళ్లి పనులు ఎప్పుడు మొదలు పెడతారు, అసలు అఖిల్ పెళ్లి హైదరాబాద్ లోనా, లేదంటే దుబాయ్‌లో చేస్తారా? అనే క్యూరియాసిటిలో అక్కినేని అభిమానులు కనిపిస్తున్నారు.