మ్యాడ్ చిత్రం అప్పుడు బావమరిది నార్నె నితిన్ కోసం ట్రైలర్ లాంచ్ చేసి ఆ చిత్రాన్ని సపోర్ట్ చేసారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. నిర్మాత నాగవంశీ కూడా ఎన్టీఆర్ తో స్నేహం ఉన్నవాడు కావడంతో అపుడు ఎన్టీఆర్ మ్యాడ్ కి సపోర్ట్ చేశారు. మ్యాడ్ స్క్వేర్ కి వచ్చేసరికి నార్నె నితిన్ కానీ, నాగవంశీ కానీ ఎన్టీఆర్ వద్దకు వెళ్ళలేదు.
ఎన్టీఆర్ కూడా దేవర ప్రమోషన్స్ తో జపాన్ ట్రిప్ లో ఉండడంతో మ్యాడ్ స్క్వేర్ యూనిట్ కూడా ఆయన్ని కదిలించలేదు. ఇప్పుడు సినిమా విడుదలై మంచి హిట్ అవడంతో సక్సెస్ సెలెబ్రేషన్స్ ప్లాన్ చేస్తుంది యూనిట్. ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్ కి ఎన్టీఆర్ ని గెస్ట్ గా పిలవబోతున్నారట.
మరి ఎన్టీఆర్ నాగవంశీ, నార్నె నితిన్ పిలిస్తే రాకుండా ఉండరు. మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ఎన్టీఆర్ గెస్ట్ గా వస్తే ఆ సినిమాకి మరిన్ని కలెక్షన్స్ పెరిగే అవకాశం లేకపోలేదు. అసలే ఈ వారం క్రేజీ సినిమాలేవీ లేవు. దానితో మ్యాడ్ స్క్వేర్ కి మరో ప్లస్ అవ్వడం ఖాయం.