Advertisementt

హీరోయిన్ మ‌మ్మీకి స‌మ‌స్య లేన‌ప్పుడు మీకేంటి

Wed 02nd Apr 2025 10:06 PM
kamal haasan  హీరోయిన్ మ‌మ్మీకి స‌మ‌స్య లేన‌ప్పుడు మీకేంటి
When Kamal reacted to stars romancing heroines half their age in movies హీరోయిన్ మ‌మ్మీకి స‌మ‌స్య లేన‌ప్పుడు మీకేంటి
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి లెజెండ్స్ త‌మ వ‌య‌సులో స‌గం కంటే త‌క్కువ ఉన్న న‌టీమ‌ణుల‌తో తెర‌ను పంచుకున్నారు. చాలామంది బాలీవుడ్ వెట‌ర‌న్ స్టార్లు త‌మ కంటే వ‌య‌సు చాలా త‌క్కువ వున్న న‌టీమ‌ణుల‌తో ప్రేమాయ‌ణాలు సాగించారు. ఇటీవ‌ల సల్మాన్ ఖాన్ (59) త‌న‌ కంటే చాలా త‌క్కువ వ‌య‌సు ఉన్న ర‌ష్మిక (28)తో రొమాన్స్ చేసారు. ప్ర‌స్తుతం దీనిపై నెటిజ‌నుల్లో చాలా పెద్ద డిబేట్ న‌డుస్తోంది. 

అయితే క‌మ‌ల్ హాస‌న్ లాంటి లెజెండ్ ని ఇదే విష‌యంపై ప్ర‌శ్నిస్తే ఆయ‌న ఏమ‌ని స‌మాధానం చెప్పారో తెలుసా? చాలామంది హాలీవుడ్ స్టార్లు త‌మ వ‌య‌సులో స‌గం కంటే త‌క్కువ వున్న హీరోయిన్ల‌తో రొమాన్స్ చేసారు. అక్క‌డ నిజ జీవితంలోను ప్రేమ‌లో ప‌డుతున్నారు. నేను కూడా అదే చేస్తాను.. అని అన్నారు. హీరోయిన్ కి లేదా త‌న మ‌మ్మీ డాడీకి స‌మ‌స్య లేన‌ప్పుడు మీకెందుకు స‌మ‌స్య‌? అని కూడా క‌మ‌ల్ ప్ర‌శ్నించారు. ఈ వ‌య‌సులో కాలేజ్ విద్యార్థిగా న‌టించ‌డం క‌ష్టం కానీ, నా వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకోవ‌డం క‌ష్టం కాద‌ని ఒక త్రోబ్యాక్ ఇంట‌ర్వ్యూలో అన్నారు.

నిజ జీవితంలో స‌గం వ‌య‌సున్న అమ్మాయితో ప్రేమ‌లో ప‌డ‌టానికి అభ్యంత‌రం ఉండ‌ద‌ని క‌మ‌ల్ హాస‌న్ అన్నారు. త‌న‌తో న‌టించేందుకు వారికి అభ్యంత‌రం లేన‌ప్పుడు ప్రేమ‌లో ప‌డ‌టానికి స‌మ‌స్య లేన‌ప్పుడు త‌ప్పేంటి? అని ప్ర‌శ్నించారు. క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌స్తుతం మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో థ‌గ్ లైఫ్ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

When Kamal reacted to stars romancing heroines half their age in movies:

Kamal Haasan on stars romancing heroines half their age

Tags:   KAMAL HAASAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ