కొడాలి నాని కి గుండెకి సంబందించిన వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ లోని గచ్చిబౌలి AIG ఆసుపత్రి లో చేరి ఐదు రోజుల ట్రీట్మెంట్ తర్వాత నానిని కుటుంబ సభ్యులు ఉన్నట్టుండి ముంబై కి షిఫ్ట్ చేయడంపై పలురకాల అనుమానాలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. కొడాలి నాని ఆరోగ్యంపై రకరకాల వార్తలు వైరల్ గా మారాయి.
ముంబై తరలించాక కూడా కొడాలి నాని ఆరోగ్యంపై ఎలాంటి అప్ డేట్ రాకపోవడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా కొడాలి నాని హెల్త్ విషయాలు బయటికొచ్చాయి. ముంబైలోని ఏషియన్ హార్ట్ హాస్పిటల్ లో కొడాలి నాని గుండెకు బైపాస్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారట డాక్టర్స్.
ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పాండ ఆధ్వర్యంలో కొడాలి నాని కి ఎనిమిది గంటల పాటు బైపాస్ సర్జరి విజయవంతంగా పూర్తి చెయ్యగా.. కొడాలి సర్జరీ తర్వాత స్పృహలోకి రావడమే కాకుండా కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లుగా తెలుస్తుంది. సో కొడాలి నాని అవుట్ ఆఫ్ డేంజర్ అన్నమాట.