మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్ తేదీ పై మెగా ఫ్యాన్స్ లో అసహనం పెరిగిపోతుంది. కానీ విశ్వంభర మేకర్స్ మాత్రం మౌనం పాటిస్తున్నారు. మే 9 రిలీజ్ ఉంటుంది అనుకుంటే అది అవ్వదు అంటున్నారు, ఆగష్టు లో రిలీజ్ అవుతుందా అంటే అదీ చెప్పట్లేదు. ఈ ఉగాది రోజున మెగాస్టార్ విశ్వంభర చిత్రం విడుదలపై మేకర్స్ ఓ క్లారిటీ ఇస్తారనుకుంటే వసిష్ఠ మాత్రం విశ్వంభర విషయాన్ని తేల్చకుండా వదిలేసారు.
మరోపక్క ఏప్రిల్ నుంచి రాజా సాబ్ పోస్ట్ పోన్ అయ్యింది, అధికారికంగా క్లారిటీ ఇవ్వకపోయినా.. అది పోస్ట్ పోన్ అయినట్లే. మారుతి కూడా నా పని నన్ను చేసుకోనివ్వండి అంటూ చల్లగా జారుకున్నాడు, ప్రభాస్-మారుతి ల రాజా సాబ్ చిత్రం సెప్టెంబర్ లేదా దసరా కి రిలీజ్ అనేది మేకర్స్ ఈ ఉగాదికి క్లారిటీ ఇస్తారని ప్రభాస్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూసారు.
అటు చిరు, ఇటు ప్రభాస్ ఇద్దరూ ఉగాది ఫెస్టివల్ ని సైలెంట్ గా వదిలేసారు. ఉగాది రోజు విశ్వంభర, రాజా సాబ్ రిలీజ్ తేదీలపై క్లారిటీ వస్తే మెగా ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ నిజంగా ఆనందించేవాళ్లు.