ఇప్పటివరకు హరి హర వీరమల్లుకి రిలీజ్ డేట్ ఇవ్వడం, దానిని పోస్ట్ పోన్ చెయ్యడము చూసి పవన్ ఫ్యాన్స్ ఆందోళన పడని రోజు లేదు. మార్చి 28 నుంచి మే 9 కి హరి హర వీరమల్లు ను పోస్ట్ పోన్ చేసినా.. ఆ డేట్ పై కూడా అందరిలో ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ లో డౌట్ తొణికిసలాడుతుంది. కానీ ఇప్పుడు వీరమల్లుపై ఇంక బెంగ అక్కర్లేదు అంటున్నారు.
హరిహర వీరమల్లు షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ కి వచ్చేసింది. వీరమల్లు కు సంబంధించి చివరి షెడ్యూల్ ఏప్రిల్ 7 నుంచి 14 వరకు జరగనుంది. ఇందులో పవన్ కాల్ షీట్లు అవసరమయ్యే రోజులు కేవలం నాలుగు రోజులు మాత్రమే అని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా వీరమల్లు దర్శకుడు అందుబాటులోకి వస్తున్నారట. మరోపక్క పోస్ట్ ప్రోడుక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయట.
ఫైనల్ ఎడిట్ కాపీని సిద్ధం చేసే పనిలో వీరమల్లు టీమ్ బిజీగా ఉంది. మరోపక్క విఎఫ్ఎక్స్ మీద పలు విదేశీ కంపెనీలు వర్క్ చేస్తున్నాయి. అవి కూడా కొలిక్కి వచ్చినట్టే అంటున్నారు. సో మే 9 కి ఎటువంటి ఆటంకాలు లేకుండా హరి హర వీరమల్లు థియేటర్స్ లోకి కాదు కాదు పాన్ ఇండియా థియేటర్స్ లోకి దిగడం ఖాయంగా కనబడుతుంది.