కొడాలి నాని క్రిటికల్ కండిషన్ లో హైదరాబాద్ AIG ఆసుపత్రి నుంచి ముంబై ఆసుపత్రికి షిఫ్ట్ అయ్యారు. గుండె సంబంధిత వ్యాధితో పాటుగా, కిడ్నీ సమస్యతో బాధపడుతున్న కొడాలి నాని ముంబైలో చికిత్స పొందుతున్నారు. కొడాలి హెల్త్ విషయంలో ఆసుపత్రి వర్గాలతో పాటుగా కుటుంబ సభ్యులు కూడా గోప్యత పాటించడం హాట్ టాపిక్ అయ్యింది.
అసలు కొడాలి కి ఏమైందో ఏమో అని ఆయన అభిమానులు అందోళన పడుతుంటే.. యాంటీ ఫ్యాన్స్ అంటే టీడీపీ అభిమానులు కొడాలి త్వరాగా కోలుకోవాలంటూ పూజలు చెయ్యడంషాకిస్తుంది. అందులో షాకవ్వాల్సిన పనేమిలేదు, కొడాలి త్వరగా కోలుకుంటే ఆయన పై కేసులు మోత మొగాలి.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా చెలరేగిపోయి టీడీపీ నేతలను, చంద్రబాబు, లోకేష్, పవన్ లను అన్నమాటలు శిక్ష అనుభవించాలనేది వారి కోరిక. అందుకే కొడాలి పూర్తి ఆరోగ్యంతో త్వరగా రావాలని, వచ్చాక జైలు ఊచలు లెక్కబెట్టాలని వారు దేవుడికి పూజలు చేస్తున్నారు.