ఏజెంట్ తర్వాత రెండేళ్ల భారీ గ్యాప్ తో అఖిల్ అక్కినేని ఈ మార్చ్ నుంచే తన కొత్త సినిమా సెట్స్ మీదకి వెళ్ళాడు, వినరో భాగ్యము విష్ణు కథ దర్శకుడు కిషోర్ అబ్భురి తో అఖిల్ పల్లెటూరి నేపథ్యంలో చిత్రాన్ని మొదలు పెట్టాడు. అన్నపూర్ణ స్టూడియోస్ లో జనవరి లోనే పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మాత్రం మార్చి 14 నే మొదలయ్యింది.
అయితే అఖిల్-కిషోర్ ఫస్ట్ లుక్ ని ఏప్రిల్ 8 అంటే అఖిల్ బర్త్ డే సందర్భంగా వదిలేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. ఏప్రిల్ 8 న అక్కినేని అభిమానులకు బ్యూటిఫుల్ ట్రీట్ ని సిద్ధం చేసి సర్ ప్రైజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట. అంతేకాదు అఖిల్ మూవి టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్.
మరి అఖిల్ ఏజెంట్ తర్వాత ఈ కొత్త చిత్రంలో ఎలా ఉండబోతున్నాడు, స్టయిల్ గా ఉంటాడా, మాస్ గా కనిపిస్తాడా, లేదంటే పల్లెటూరి అబ్బాయిగా దర్శనమిస్తాడా అని అక్కినేని ఫ్యాన్స్ చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు.