ప్రముఖ కథానాయిక డ్రగ్స్ దందాలో బుక్కైంది. నార్కోటిక్స్ అధికారుల పరిశీలనలో.. డ్రగ్స్ సిండికేట్ తో వాట్సాప్ చాటుల్లో అడ్డంగా దొరికిపోయింది. తర్వాత అరెస్టయి బెయిల్ రాక నెలల పాటు జైలు జీవితం అనుభవించింది. ఆ సమయంలో తీవ్రమైన మానసిక ఆందోళనకు గురైంది. ఇప్పుడు బెయిల్ పై బయటికి వచ్చినా నటిలో ఎలాంటి మార్పు కనిపించకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. కెరీర్ ని పునరుద్ధరించుకునేందుకు ట్రై చేసినా ఇప్పుడు ఆ నటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. తన ముందు ఉన్న ఒకే ఒక్క అవకాశం సోషల్ మీడియాల్లో తనను తాను ప్రమోట్ చేసుకోవడం.. అందుకే వరుస ఫోటోషూట్లతో ఇష్టానుసారం చెలరేగుతోంది. ఏడాదికాలంగా ఈ నటి బోల్డ్ ఫోటోషూట్లు వీడియోషూట్లు షేర్ చేస్తున్నా అవకాశాలిచ్చేవాళ్లే కరువయ్యారు.
అయితే ఇక్కడ అవకాశాలు కాదు అసలు సమస్య.. ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ తర్వాత ఆ నటిలో పరివర్తన ఎంత? అనేదే చిక్కు ప్రశ్న. యాటిట్యూడ్ మారిందా? గత తప్పులను సరిదిద్దుకుని బుద్ధిగా మారిందా? అంటే అలాంటిదేమీ కనిపించడం లేదు. ఈ నటి సోషల్ మీడియా పోస్టులు చూసిన ఎవరైనా ససేమిరా మారదు! అనే విశ్లేషిస్తున్నారు. సోషల్ మీడియాలు వ్యక్తుల ముఖంలో డార్క్ షేడ్ ని చూపించగలవు అనేందుకు ఈ నటి సోషల్ మీడియాలు ఒక ప్రూఫ్. నిజానికి రంగుల ప్రపంచంలో ఒకసారి చెడ్డ పేరు వచ్చాక తిరిగి కోలుకోవడం అంత సులువేమీ కాదు. ఇక్కడ వెనక నుంచి దెప్పి పొడిచేవాళ్లే చాలా ఎక్కువ.
ప్రస్తుతం ఈ నటి పరిస్థితి అందుకు మినహాయింపు కాదు. ఇటీవల ఓ సినిమాలో నటిస్తున్నా అదంతా హంబక్కు. ఇది ఎప్పటికి రిలీజవుతుందో తెలీదు. తనకు అవకాశాలు ఉన్నా లేకపోయినా సోషల్ మీడియా హంగామాలో ఎక్కడా తగ్గలేదు. వరుసగా బోల్డ్ ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. ప్రముఖులతో కొన్ని ఫోటోలు దిగి లేదా వీడియో షూట్లు చేయించి ఇన్ స్టాలో పోస్ట్ చేస్తోంది. బోల్డ్ గా మల్లె పూలు బంతిపూలతో ఉగాది ఫోటోషూట్ చేసి అందరికీ షాకిచ్చింది. అయితే ఈ నటి ఎంత చేసినా తిరిగి పాత రోజులు వస్తాయా? ఎప్పటిలానే గౌరవంగా ఇండస్ట్రీలో మనుగడ సాగించగలదా? అంటే..చెప్పలేని పరిస్థితి. ఇకనైనా పద్ధతి మారాలని తెలిసినవారు ఈ నటికి సలహాలిస్తున్నా మారడం లేదట! కొన్నిటికి కాలమే సమాధానం చెప్పాలి.