అంబాని ఫ్యామిలీ అంటే ప్రపంచంలోనే ప్రత్యేకం. అంత కోటీశ్వరులు అంబానీలు. అందులోను ముఖేశ్ అంబాని ఫ్యామిలీ మరింత ప్రత్యేకం. ప్రపంచంలోని ప్రజలంతా మాట్లాడుకునేలా ముఖేష్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. అయితే అనంత్ అంబానీ మాత్రం అనారోగ్య సమస్యలతో ఊబకాయంతో ఇబ్బందిపడతారు.
తాజాగా అనంత్ అంబానీ సాహసయాత్ర సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అనంత అంబానీ 140 కిలో మీటర్లు కాలినడకన ద్వారక చేరుకునేందుకు చేస్తున్న యాత్ర సాహసయాత్ర. గుజరాత్‌లోని జామ్ నగర్ నుంచి ద్వారకకు పాదయాత్ర చేస్తున్నారు. ఏప్రిల్ 10 ఆయన బర్త్ డే కి ద్వారకకు చేరుకునేలా అనంత్ అంబానీ నడక మొదలు పెట్టారు.
ఈపాటి దానికి అన్ని రోజల అవసరమేమిటి అనుకోకండి, అనంత్ అంబానీ డే కాకుండా కేవలం రాత్రి పూట మాత్రమే అంటే రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 వరకు మాత్రమే పాదయాత్ర చేస్తున్నారు. తన బర్త్ డే ఏప్రిల్ 10 న ద్వారకలో ప్రత్యేక పూజలు చేసేందుకే అనంత్ అంబానీ ఇలా నడుస్తున్నారు అని తెలుస్తోంది.