మ్యాడ్ స్వేర్ నిర్మాత నాగవంశీ స్పెషల్ గా ప్రెస్ మీట్ అనగానే అందరిలో ఎన్నెన్నో రకాల ప్రశ్నలు. సినిమా సక్సెస్ అయితే టీమ్ మొత్తం ప్రెస్ మీట్ పెట్టాలి కానీ.. నిర్మాత నాగవంశీ ఒక్కరే మీడియా ముందుకు రారు, కానీ వస్తున్నారు అంటే అదేదో వివాదాస్పదమే అనుకున్నారు. అందరూ అనుకున్నదే అయ్యింది.
నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టింది మీడియా కోసమే, తన సినిమాలపై రివ్యూవర్స్ ఇచ్చే రేటింగ్స్ పై మంట పుట్టి రివ్యూ రైటర్స్ పై ఫైర్ అవ్వడానికే ఆయన ప్రత్యేకంగా మీడియా మీట్ పెట్టారు. మ్యాడ్ స్వేర్ చిత్రం రివ్యూ రేటింగ్స్ తో సంబందం లేకుండా అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టడంలో నాగవంశీ రివ్యూ రైటర్స్ పై ఫైర్ అయ్యారు. మా సినిమా కి కలెక్షన్స్ వచ్చేసాయి, బ్రేక్ ఈవెన్ అయ్యింది, సో పెంచిన టికెట్ రేట్లు తగ్గించేస్తున్నాం అంటూ మొదలు పెట్టి రివ్యూస్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు.
నా సినిమాలకు పబ్లిసిటీ చెయ్యకండి, నా సినిమాలకు రివ్యూస్ ఇవ్వకండి, అవసరం అయితే నా సినిమాలు బాన్ చేయండి, సినిమా చూడకండి, నా సినిమాలను ఎలా పబ్లిసిటీ చేసుకోవాలో నాకు తెలుసు. అంతేకాదు నేను వేసే కలెక్షన్స్ ఫేక్ అంటూ ప్రచారం చేస్తున్నారు, కలెక్షన్ ఫేక్ అని ప్రూవ్ చేయమనండి ఎవర్నైనా! కార్పొరేట్ బుకింగ్స్ చేసి హౌస్‌ఫుల్ అని చెప్పుకోడానికి ఇది ఏమన్నా హీరో సినిమా నా.. అంటూ నాగవంశీ మీడియాపై ప్రెస్ మీట్ పెట్టి మరీ విరుచుకుపడ్డారు.