ప్రేక్షకులకు సరైన సినిమా పడక చాలా బోరింగ్ గా మారిపోయారు. వరస సెలవలు, లాంగ్ వీకెండ్ కానీ ఎంజాయ్ చేసేందుకు, ఎంటర్టైన్ చేసేందుకు అద్భుతమైన సినిమాలు లేవు, భారీ బడ్జెట్ సినిమాలన్నీ సమ్మర్ నుంచి మొహం చాటేశాయి. అనుకున్న సమయానికి ఏవి థియేటర్స్ లోకి రావడం లేదు.
చిన్న సినిమా అయినా కాస్త టాక్ బావుంటే థియేటర్స్ కి జనాలు కదులుతున్నారు. మొన్నటికి మొన్న చిన్న సినిమా కోర్ట్ థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే.. ఇప్పుడు ఉగాది స్పెషల్ గా ఆడియెన్స్ ముందుకు వచ్చిన చిన్న చిత్రం మ్యాడ్ స్క్వేర్ అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతుంది. హిట్ టాక్ తెచ్చుకున్న మ్యాడ్ స్క్వేర్ కలెక్షన్స్ పరంగా కొత్త నెంబర్లు నమోదు చెయ్యడం విశేషమేమీ కాదు.
కానీ మ్యాడ్ స్క్వేర్ కి క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. ఫస్ట్ హాఫ్ గోవా ఎపిసోడ్ బావున్నా, సెకండ్ హాఫ్ లో హాస్యం పండలేదు అంటూ సినీ విమర్శకులు తేల్చేసారు. కానీ మ్యాడ్ స్క్వేర్ ప్రేక్షకులకు సూపర్ ఎంటర్టైనర్ గా కనెక్ట్ అవడంతో కలెక్షన్స్ వరదపారుతుంది. నిర్మాత నాగవంశీ కి లాభాలే లాభాలు.
మిక్స్డ్ రివ్యూస్ తో ఈ రేంజ్ కలెక్షన్స్ అవడం చూసి కంటెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే కలెక్షన్స్ ని ఎవ్వరు ఆపలేరు అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు