ధనుష్ దర్శత్వంలో యంగ్ హీరో, హీరోయిన్స్ పవీష్ నారాయణన్-అనికా సురేంద్రన్ జంటగా తెరకెక్కిన జాబిలమ్మ నీకు అంత కోపమా చిత్రం థియేటర్స్ లో డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. అయినప్పటికీ జాబిలమ్మ నీకు అంత కోపమా చిత్రానికి ప్రదీప్ రంగనాధన్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ థ్రెట్ అయ్యి కూర్చుంది.
అదే రోజు విడుదలైన డ్రాగన్ చిత్రానికి యూత్ కనెక్ట్ అవడంతో జాబిలమ్మ నీకు అంత కోపమా చిత్రానికి కలెక్షన్స్ రాకుండా పోయాయి. ఈ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. ఎప్పుడో ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ నుంచి స్ట్రీమింగ్ లోకి తెచ్చేసింది.
కానీ తెలుగు వెర్షన్ మాత్రం ఇండియాలో అందుబాటులోకి రాలేదు. ఇండియన్ వెర్షన్ ఓటీటీ కూడా సస్పెన్స్ గా మారిన సమయంలో జాబిలమ్మ నీకు అంత కోపమా సడన్ గా అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో ప్రత్యక్షమైంది. థియేటర్స్ లో ఈ చిత్రాన్ని వీక్షించలేని వారు ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు జాబిలమ్మ నీకు అంత కోపమా ఓటీటీలోకి వచ్చేసింది, ఇంకా లేటెందుకు వీక్షించేయ్యండి.