రంజాన్ కి సల్మాన్ నుంచి ఎలాంటి సినిమా వచ్చినా కలెక్షన్స్ సునామీలో తడిచిపోయిన సందర్భాలు ఎన్నో. ఆసినిమా ప్లాప్ అయినా 150 కోట్లు సునాయాసంగా తెచ్చేది. కానీ ఇప్పుడు సల్మాన్ ఖాన్ సినిమాకి దారుణాతి దారుణమైన కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ రంజాన్ కి విడుదలైన సికందర్ మూవీ మొదటిరోజుకే పబ్లిక్ నుంచి క్రిటిక్స్ నుంచి వరెస్ట్ రివ్యూస్ వచ్చాయి.
మరోపక్క సినిమా విడుదలయ్యే కొన్ని గంటల ముందే సినిమా ఆన్ లైన్ లో విడుదలవడం మరింత దారుణమైన పరిస్థితి. మొదటి రోజు సికందర్ ఓపెనింగ్స్ పరంగా డిజాస్టర్ నెంబర్లు నమోదు చెయ్యగా.. ఇప్పుడు సికందర్ కి మరింత దారుణమైన పరిస్థితి ఎదురైంది. సికందర్ విడుదలైన మల్టిప్లెక్స్ థియేటర్స్ లో షోస్ క్యాన్సిల్ అవడం షాక్ ని కలిగిస్తుంది.
బుకింగ్స్ లేక, నెగెటివ్ టాక్ చూసి బుక్ చేసుకున్నవారు కూడా థియేటర్స్ కి మొహం చాటెయ్యడంతో, ఒకటి అరా ప్రేక్షకులకు షో వెయ్యలేక థియేటర్స్ యాజమాన్యం షోస్ క్యాన్సిల్ చేసి టికెట్ బుక్ చేసుకున్నవారికి రిఫండ్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. సల్మాన్ ఖాన్ సినిమాకి ఇలాంటి పరిస్థితి ఇదే మొదటిసారి అంటూ అభిమానులు అవమానంగా ఫీలవుతున్నారు.