నాని నిర్మాతగా ప్రియదర్శి కీలక పాత్రలో తెరకెక్కిన కోర్ట్ మూవీ థియేటర్స్ లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. నాని కోర్ట్ మూవీ తో 50 కోట్ల మార్క్ ని టచ్ చేసారు. హీరోగా 100 కోట్ల క్లబ్బులో ఉన్న నాని నిర్మాతగా 50 కోట్ల క్లబ్బులోకి ఎంటర్ అయ్యారు. కోర్ట్ మూవీ నచ్చకపోతే నా హిట్ 3 చూడొద్దు అని చెప్పిన నాని కోర్ట్ తో సూపర్ హిట్ సాధించారు.
ప్రస్తుతం కోర్ట్ మూవీ థియేట్రికల్ రన్ ముగియడంతో ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్దమవుతుంది. థియేటర్స్ లోనే కాదు కోర్ట్ ఓటీటీలోనూ సెన్సేషన్ క్రియేట్ చెయ్యడం ఖాయమంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కోర్ట్ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకుంది.
తాజాగా కోర్ట్ ఏప్రిల్ 11 నుంచి నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లోకి తెచ్చే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ డేట్ అధికారికంగా మాత్రమే కాదు త్వరలోనే ఏప్రిల్ 11 ఉంచి కోర్ట్ స్ట్రీమింగ్ అనే అఫీషియల్ అనౌన్సమెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.