ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై రోజుకో వార్త వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్‌ను డిజైన్ చేయాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ పాట కోసం బాలీవుడ్ నుంచి ఓ స్టార్ హీరోయిన్‌ను తీసుకురావాలని ఆయన ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇక ఈ సినిమా టైటిల్ డ్రాగన్ అనే ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాను ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యంత శక్తివంతమైన సినిమాగా తీర్చిదిద్దాలని ప్రశాంత్ నీల్ ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అందుకే కథపై పూర్తిగా కేంద్రీకరించి సినిమాకు అద్భుతమైన స్క్రిప్ట్‌ను రూపొందించేందుకు ఎక్కువ సమయం తీసుకున్నాడని సమాచారం. ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమాల్లో ఇది బెస్ట్ అవుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కొన్నిరోజుల క్రితం ఈ సినిమా గురించి మాట్లాడిన ప్రశాంత్ నీల్ ఆడియన్స్ ఊహించని స్థాయిలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం అందుకే ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను అని వెల్లడించాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి రోజుకో కొత్త వార్త వినిపిస్తూనే ఉంది.
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తుండగా సంగీతం రవి బస్రూర్ అందిస్తున్నారు. మూవీకి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.