మాజీ మంత్రి, వైసీపీ నేత కోడలి నాని గ్యాస్ట్రిక్ సమస్యతో హైదరాబాద్ లోని AIG ఆసుపత్రి లో ఈ నెల 26న జాయిన్ అవగా AIG వైద్యులు కొడాలి నానికి గుండెకి సంబందించిన పరీక్షలు చేసి ఆయన వాల్ బ్లాక్ అయినట్లు నిర్ధారించినట్లుగా వార్తలొచ్చాయి. గత ఐదు రోజులుగా కోడాలి నాని AIG లో లో డాక్టర్స్ పర్యవేక్షనలో ఉన్నారు.
కొడాలి నానికి వైద్య పరీక్షలు చేసి గుండెకు సంబంధించిన 3 వాల్వ్స్ క్లోజ్ అయినట్లు వైద్యులు నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. స్టంట్ లేదా బైపాస్ సర్జరీ కోసం డాక్టర్లు సూచించగా.. సర్జరీ విషయంలో కొంత సమయం తీసుకోవాలనే యోచనలో కొడాలి కుటుంబ సభ్యులు ఉన్నట్లుగా తెలుస్తుంది.
ఐదు రోజులుగా ఆసుపత్రిలో ఉన్న కొడాలి నాని ఈరోజు గచ్చిబౌలి లోని AIG ఆసుపత్రి నుంచి డిస్ ఛార్జ్ అయ్యి హైదరాబాద్ లోని ఆయన నివాసానికి చేరుకున్నారు.