శ్రీలీల కెరీర్ స్టార్టింగ్ లో అనుభవం లేక వరసగా ఒకే రకమయిన కథలను ఎంపిక చేసుకుని కెరీర్ లో కోలుకోలేని దెబ్బతింది. యంగ్ హీరోలందరితో జత కట్టినా, ప్రతి సినిమాలో శ్రీలీలది ఒకేరకయిన కేరెక్టర్. నాలుగు పాటలు, నాలుగు సీన్స్ మాత్రమే చేసింది. భారీ బడ్జెట్ సినిమా కూడా శ్రీలీలకు అదే తరహా పాత్ర అంటగట్టింది.
దానితో వరస వైఫల్యాలను చూసిన శ్రీలీల ఓ ఏడాది పాటు లాంగ్ బ్రేక్ తీసుకుని పుష్ప కిస్సిక్ సాంగ్ తో కొత్త స్టెప్ తీసుకుని అందులో సక్సెస్ అయ్యింది. ఆతర్వాత శ్రీలీల రష్మిక వదులుకున్న రాబిన్ హుడ్ మూవీలోకి ఎంటర్ అయ్యింది. గతంలో ప్లాప్ ఇచ్చిన నితిన్ ఈసారి శ్రీలీల కి ఎలాంటి రిజల్ట్ ఇస్తాడో అని అందరూ ఎదురు చూసారు.
కానీ శ్రీలీల మళ్లీ మళ్లీ అదే పొరబాటు. గతంలో చేసిన పాత్రలాంటి పాత్రనే రాబిన్ హుడ్ లోను ఎంచుకుంది. ఏముంది మరోసారి విమర్శలపాలయ్యింది. రాబిన్ హుడ్ లో నాలుగు పాటలు, నాలుగు సీన్స్ కి పరిమితమైంది, సినిమా హిట్ అయ్యిందా అంటే అదీ లేదు, దానితో మరో ప్లాప్ శ్రీలీల ఖాతాలో వేసుకుంది. ఇక్కడ మరోసారి శ్రీలీల అనుభవలేమి స్పష్టంగా కనిపించింది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.