గత ఏడాది ఇద్దరు హీరోయిన్స్ జిమ్ లో గాయపడి స్టిల్ ఇప్పటికి కోలుకోలేదు. సక్సెస్ ఫుల్ హీరోయిన్ రష్మిక మందన్న గత ఏడాది జిమ్ లో గాయపడింది. ఆమె కాలుకి గాయమవగా ఆమె చాలారోజుల పాటు నడవ లేక వీల్ చైర్ కి పరిమితమైంది. ఛావా ప్రమోషన్స్ సమయంలో రష్మిక విక్కీ కౌశల్ సహాయంతో స్టేజ్ పైకి వచ్చింది.
రీసెంట్ గా సికందర్ ప్రమోషన్ లోను రష్మిక తనకి తగిలిన గాయం అప్పుడే తగ్గదు, ఇంకాస్త సమయం పడుతుంది అంటూ చెప్పడమే కాదు, ఇంకా రష్మిక కుంటుతూనే కనిపించింది. మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ కూడా గత ఏడాది జిమ్ లో 80 కిలోల వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు నడుం పట్టేసి గాయంతో చాలా ఇబ్బంది పడింది.
తనకి గాయమై ఆరు నెలలు పూర్తయినా ఇంకా గాయం నుంచి కోలుకోలేదు అంటూ లాక్మే ఫ్యాషన్ వీక్ లో పాల్గొన్న రకుల్ తెలియజేసింది. జిమ్ లో నాకు తగిలి గాయం నాకో ఎదురు దెబ్బ. ఆ గాయాన్ని చాలా తేలిగ్గా నిర్లక్ష్యంగా తీసుకున్నాను, కానీ అది నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. చికిత్స తీసుకోవాలని అనుకునే సమయానికే గాయం తీవ్ర ఎక్కువైంది.
అన్ని మనం అనుకున్నట్లుగా జరగవు, ప్రస్తుతం ధైర్యంగా గాయంపై పోరాడుతున్నాను, నా వర్క్ లో బిజీ అవుతున్నాను అంటూ రకుల్ గాయం తీవ్రత గురించి చెప్పుకొచ్చింది.