మెగాస్టార్ మనవరాలు, రామ్ చరణ్ వారసురాలు క్లిన్ కారా ఫేస్ ని ఇప్పటివరకు రివీల్ చెయ్యకుండా ఊరిస్తూ వస్తున్నారు. తన కుమార్తె కు ప్రైవసీ ముఖ్యమని, అందుకే తనని అలా దాస్తున్నాను, తనని నాన్న అని క్లిన్ కారా ఎప్పుడు పిలుస్తుందో అప్పుడు క్లిన్ కారా మొహాన్ని అందరికి చూపిస్తాను అంటూ రామ్ చరణ్ బాలయ్య అన్ స్టాపబుల్ షోలో రివీల్ చేసారు.
రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసనలు తమ కుమార్తె క్లిన్ కారా ఫేస్ ని రివీల్ చెయ్యకుండా ఆమె కు సంబందించిన ప్రతి ఒక్క విషయాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా మెగా మనవరాలు క్లిన్ కారా మెగాస్టార్ సతీమణి సురేఖ, రామ్ చరణ్ సతీమణి ఉపాసనలతో కలిసి ఉగాది పూజలో మెరిసింది.
చిట్టిపొట్టి ఫ్రాక్ లో రామ్ చరణ్ కూతురు క్లిన్ కారా నానమ్మ తో కలిసి ఉగాది పూజ చేసిన పిక్స్ ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎప్పటిలాగే క్లిన్ కారా ఫేస్ ని మాత్రం చూపించకుండా దాచేసారు.